ఇండియాలో ఎన్నికల్ని మానిప్యులేట్ చేస్తున్న ఇజ్రాయిల్ సంస్థ..??

జర్నలిస్టుల అంతర్జాతీయ బృందం రీసెంట్‌గా ఇజ్రాయెలీ తప్పుడు సమాచార విభాగాన్ని బజారు కిడ్చింది. టీమ్ జార్జ్ అని పిలిచే ఈ నిఘా సంస్థ ఎనిమిది నెలలపాటు వివిధ దేశాల ఎన్నికలలో జోక్యం చేసుకున్నట్లు ఆ బృందం బహిర్గతం చేసింది.

 How Israel Firm Influencing Elections In India Details, Indian Elections, Electi-TeluguStop.com

సోషల్ మీడియాలో హ్యాకింగ్, విధ్వంసం, ఆటోమేటెడ్ తప్పుడు సమాచారాన్ని ఉపయోగించి ప్రపంచవ్యాప్తంగా 30 ఎన్నికలను తారుమారు చేసినట్లు ఇజ్రాయెల్ కంపెనీ సైతం అంగీకరించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

Telugu Congress, Interference, India, Indian, Israel Firm, Israel, George-Latest

ఇజ్రాయెల్ గ్రూప్ సైబర్ టూల్స్ ఉపయోగించిన దేశాలలో భారతదేశం కూడా ఒకటి కావడం గమనార్హం.దీంతో ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఆందోళనలను లేవనెత్తింది.ప్రభుత్వం ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తుందా అని ప్రశ్నించింది, ఒక కాంగ్రెస్ నాయకుడు ఇజ్రాయెల్ ఆధారిత సంస్థ.

బీజేపీ ఐటీ సెల్ మధ్య పెద్ద తేడా లేదన్నట్లు కామెంట్లు చేశారు.ఇండియాలో బీజేపీ ఐటీ సెల్ ఎలక్షన్లను ఎలా తన వైపు తిప్పుకునేలా మానిప్యులేట్ చేస్తుందో అలాగే ఇజ్రాయెల్ ఆధారిత సంస్థ చేసి ఉండొచ్చని అతను షాకింగ్ కామెంట్స్ చేశారు.

Telugu Congress, Interference, India, Indian, Israel Firm, Israel, George-Latest

ఇండియన్ ఎలక్షన్లలో ఫలితాలను తమకు అనుకూలంగా మార్చడానికి ఇజ్రాయెల్ కాంట్రాక్టర్ల బృందాన్ని బీజేపీ పార్టీ నేతలు ఉపయోగించుకున్నారనే ఆరోపణలపై విచారణ జరపాలని కాంగ్రెస్ పార్టీ బలమైన డిమాండ్స్ కూడా వినిపిస్తోంది.నకిలీ వార్తల్ని ప్రజల్లోకి పంపి, అక్రమ దారిలో గెలవడం అన్యాయం అని, టీమ్ జార్జ్ చేస్తున్న కుట్రలతో భారతీయుల డేటా కూడా చోరీ అవుతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధులు పవన్ ఖేరా, సుప్రియా శ్రీనటే తీవ్ర ఆరోపణలు చేశారు.దీనిపై బీజేపీ సర్కార్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube