ప్రస్తుతం యువగళం పాదయాత్ర చేపడుతున్న టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తమ రాజకీయ ప్రత్యర్థులను టార్గెట్ చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.అయితే వైసీపీ తరఫున ఫైర్ బ్రాండ్ నాయకుడిగా గుర్తింపు పొందిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం టిడిపి ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను ఉద్దేశించి లోకేష్ విమర్శలు చేయడం, గుడివాడ, గన్నవరం నియోజకవర్గంలో వారిని ఓడించి తీరుతామంటూ లోకేష్ ప్రతిజ్ఞ చేశారు.
వారిని ఓడించేందుకు తమ వద్ద ప్రత్యేక వ్యూహాలు ఉన్నాయంటూ లోకేష్ మాట్లాడడంపై వల్లభనేని వంశీ ఘాటుగా స్పందించారు.తనను, కొడాలి నానిని ఓడించాలంటే చంద్రబాబు ముత్తాత తరం కాదని సవాల్ చేశారు.
లోకేష్ నాయుడు, వాళ్ళ నాన్న చంద్రబాబు నాయుడు, వాళ్ళ నాన్న ఖర్జూర నాయుడు, వాళ్ల నాన్న లవంగం నాయుడు, వాళ్ల నాన్న యాలకుల నాయుడు ఇలా ఎంతమంది వచ్చినా, తనను, నానిని ఓడించలేరని వంశీ సవాల్ చేశారు.
ఎవరో ఎందుకు గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో చంద్రబాబు, నారా లోకేష్ తమపై పోటీ చేయాలంటూ వంశీ సవాల్ చేశారు. చంద్రబాబు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి బీటలు పడ్డాయని, ముందు దాని గురించి పట్టించుకోవాలని వంశీ సూచించారు.కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి గోరంగా ఓడిందని, ఇవే ఫలితాలు 2024 ఎన్నికల్లోను రిపీట్ అవుతాయని జ్యోష్యం చెప్పారు.
చంద్రబాబు కుప్పంలో సొంత ఇల్లు కట్టుకున్నా ప్రయోజనం లేదన్నారు.ఇక నారా లోకేష్ గురించి మాట్లాడుకోవడం కూడా దండగే అని వంశీ మండపడ్డారు.తండ్రి ముఖ్యమంత్రిగా, తాను మంత్రిగా పనిచేసినా.2019 ఎన్నికల్లో లోకేష్ గెలవలేకపోయాడని, దీన్ని బట్టి ఆయన స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చని వంశీ ఎద్దేవా చేశారు.చంద్రబాబు లోకేష్ వన్ని ఉడత ఊపులేనని , తాను తెలుగుదేశం స్కూల్లోనే చదువుకున్నానని, వారి గురించి తనకు తెలియదా అంటూ వంశీ సెటైర్లు వేశారు.