ఏడాదికి రూ.6.5 కోట్ల వేతనం.. ఉచితంగా ఇల్లు.. ఇతర సౌకర్యాలు

మంచి ఉద్యోగం చేయాలని, చక్కగా స్థిరపడాలని అందరికీ ఉంటుంది.ఇంజినీరింగ్, మెడిసిన్, బిజినెస్ తదితర రంగాలలో డిగ్రీలు, పీజీలు చేసి ఉద్యోగాన్వేషణలో ఉంటారు.

 Salary Rs6.5 Crore Per Annum Free House Other Facilities ,free House, Viral Lat-TeluguStop.com

భారీ జీతంతో కొలువులు అందుకుంటుంటారు.దీని కోసం చాలా ప్రయాస పడుతుంటారు.

అయితే విదేశాలలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఆస్ట్రేలియాలోని ఓ పట్టణం గుడ్ న్యూస్ అందించింది.మెడిసిన్ చేసిన వారికి భారీ వేతనంతో పాటు, ఇతర సౌకర్యాలను అందచేస్తోంది.ఏడాదికి రూ.6.5 కోట్ల భారీ వేతనాన్ని ఆ పట్టణం ఆఫర్ చేస్తోంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Telugu Australia, Doctors, Doctors Salary, Bedroom, Job, Latest-Telugu NRI

పశ్చిమ ఆస్ట్రేలియాలోని క్వెరోడింగ్ అనే చిన్న పట్టణం ఉంది.స్థానికంగా మెడికల్ ప్రాక్టీషనర్ లేరు.దీంతో ఇక్కడి అధికారులు భారీ జీతంతో ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నారు.ఏడాదికి రూ.6.5 కోట్ల వేతనం అందించనున్నారు.అంతేకాకుండా ఆ డాక్టరుకు ఉండడానికి నాలుగు బెడ్‌రూమ్‌ల ఇల్లు ఉచితంగా ఇస్తారు.ఇక భారీ జీతం, ఇతర సౌకర్యాలు అందించడానికి చాలా కారణాలు ఉన్నాయి.చిన్న చిన్న పట్టణాలలో పని చేసేందుకు వైద్యులు ఇష్టపడడం లేదు.దీంతో పట్టణాలలో డాక్టర్ల కొరత బాగా ఎక్కువగా ఉంది.

Telugu Australia, Doctors, Doctors Salary, Bedroom, Job, Latest-Telugu NRI

వైద్యులు లేకపోవడం, చికిత్సా సౌకర్యాల లోపంతో అక్కడ ఇబ్బందులు ఉన్నాయి.ఆస్ట్రేలియా వైద్య విద్యార్థులలో 14 శాతం మాత్రమే ప్రాక్టీస్ చేయాలనుకుంటున్నారు.అందులోనూ చిన్న స్థాయి పట్టణాలలో పని చేయాలనుకునే వారి శాతం కేవలం 4.5గా ఉంది.దీంతో క్రమంగా అక్కడ డాక్టర్ల కొరత ఏర్పడనుందనే అంచనాలు ఉన్నాయి.దీంతో భారీ వేతనం, చక్కటి సౌకర్యాలతో పాటు కళ్లు చెదిరే బోనస్ కూడా అధికారులు ఆఫర్ చేస్తున్నారు.

రెండేళ్లు ఏదైనా పట్టణంలో వైద్యులు పని చేస్తే 12 వేల ఆస్ట్రేలియన్ డాలర్లను అందించనున్నారు.భారత కరెన్సీలో అది రూ.9.94 లక్షలు.ఇక ఐదేళ్లు ఒకే పట్టణంలో పని చేస్తే 23 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు (భారత కరెన్సీలో రూ.19.05 లక్షలు) బోనస్ అందిస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube