మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రన్ని గట్టిగా నమ్ముతారు.వాసు శాస్త్రం సానుకూల, ప్రతికూల శక్తుల పై ఆధారపడి ఉంటుంది.
వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించడం వల్ల ఆ ఇల్లు ఎలాంటి ఆటంకులు రాకుండా ఉంటుంది.ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు తీసుకురావడానికి వాస్తు శాస్త్ర నియమాలు ఎంత ప్రభావంతంగా పనిచేస్తాయి.
సానుకూల శక్తి ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సును తెలుస్తుంది.అయితే ప్రతికూల శక్తి జీవితంలో అనేక సమస్యలను తీసుకుని వస్తుంది.
చాలాసార్లు ప్రతిదీ సరైన మార్గంలో చేసిన తర్వాత కూడా ఒక వ్యక్తి మళ్ళీ మళ్ళీ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది.వాస్తు ప్రకారం ఒక వ్యక్తి యొక్క కొన్ని అలవాట్లు మాత్రమే అతని పురోగతికి ఆటంకం కలిగిస్తూ ఉంటాయి.
దీని కారణంగా ఇంట్లో ఎప్పుడు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది.వాస్తు ప్రకారం ఒక వ్యక్తి కొన్ని అలవాట్లను తక్షణమే దూరంగా ఉండాలి.ఆ అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది మంచం పై కూర్చుని ఆహారం తింటూ ఉంటారు.వాస్తు శాస్త్రం ప్రకారం లక్ష్మీదేవికి మంచం మీద కూర్చొని ఆహారం తినడం వల్ల కోపం వస్తుంది.దీనితో పాటు ఇంట్లో ఆనందం మరియు శాంతి లేకుండా పోతుంది.
మంచం మీద కూర్చుని భోజనం చేయడం వల్ల కుటుంబ సభ్యులు అప్పుల పాలవుతారు.రాత్రి భోజనం చేసిన తర్వాత చాలామంది వంట గది మురికిగా ఉంచి సింక్ లో పడి ఉన్న పాత్రలను వదిలి నిద్రపోతారు.వాస్తు శాస్త్రం ప్రకారం తల్లి అన్నపూర్ణ రాత్రి పూట ఇలా పాత్రలను శుభ్రం చేయకుండా వదిలేస్తే ఆగ్రహానికి లోనవుతుంది.ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో పాటు మానసిక ఒత్తిడి నీ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం వద్ద చెత్త బుట్టాలను ఎప్పుడూ ఉంచకూడదు.