తెలంగాణలో మెడికల్ కాలేజీలపై కేంద్రమంత్రులు తలో మాట చెబుతున్నారని మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు.ఒకే తరహా అబద్ధాలు చెప్పేలా కేంద్రమంత్రులకు ప్రధాని మోదీ శిక్షణ ఇవ్వాలని సూచించారు.
తెలంగాణకు తొమ్మిది మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంటున్నారన్న కేటీఆర్ మరోమంత్రి మన్ సుఖ్ మాండవీయ అసలు ప్రపోజలే అందలేదంటున్నారని చెప్పారు.మరోవైపు రెండు ప్రపోజల్స్ అందాయని నిర్మలా సీతారామన్ అంటున్నారన్నారు.
ఈ క్రమంలో ఇలా విభిన్నమైన ప్రకటనలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు.అసలు రాష్ట్రానికి ఎన్ని కాలేజీలు మంజూరు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.