నందమూరి బాలకృష్ణ మొన్న సంక్రాంతి కి వీర సింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి రూ.100 కోట్ల కలెక్షన్స్ కి పైగా రాబట్టిన విషయం తెలిసిందే.గోపీచంద్ మలినేని దర్శకత్వం లో రూపొందిన వీర సింహారెడ్డి సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది.పైగా సంక్రాంతి సీజన్ లో రావడం తో రూ.100 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసింది.సాధారణంగా సంక్రాంతి సీజన్ లో కాకుండా వీర సింహారెడ్డి ఇతర సమయాల్లో విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా రూ.100 కోట్ల కలెక్షన్స్ కి చేరువ అవ్వలేక పోయేది అంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ అభిమానులతో పాటు సంక్రాంతి సినిమా కు ప్రేక్షకుల నుండి ఆదరణ ఎక్కువగా ఉంటుంది, అందుకే బాలకృష్ణ తన తదుపరి సినిమా ని కూడా సంక్రాంతి కి విడుదల చేయాలని భావిస్తున్నాడు అంటూ సమాచారం అందుతుంది.ప్రస్తుతం బాలకృష్ణ హీరో గా అనిల్ రావిపూడి దర్శకత్వం లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.ఆ సినిమా లో విభిన్నమైన మూడు గెటప్స్ తో బాలకృష్ణ కనిపించబోతున్నాడని సమాచారం అందుతుంది.నందమూరి అభిమానులతో పాటు కచ్చితంగా అన్ని వర్గాల తెలుగు ప్రేక్షకులను అలరించే విధంగా అనిల్ రావిపూడి

ఈ సినిమా ను బాలయ్యతో రూపొందిస్తున్నట్లుగా తెలుస్తోంది.కనుక ఈ సినిమా ఖచ్చితం గా సంక్రాంతి కి విడుదలయితే భారీ విజయాన్ని సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలం గా ఉన్నాయి.మరో 100 కోట్ల సినిమా బాలయ్య ఖాతా లో పడటం ఖాయం కనుక సంక్రాంతి కి బాలయ్య ఈ సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్ చేయాలని అభిమానులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.మరి దర్శకుడు అనిల్ రావిపూడి యొక్క నిర్ణయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.







