ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని టీడీపీ నేత వర్ల రామయ్య కలిశారు.ఈ క్రమంలో పోలీసులపై ఆయన ఫిర్యాదు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పేరుతో యువగళం పాదయాత్ర నిర్వాహకులను పోలీసులు హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలు, గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయన్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ జెండాలు, బ్యానర్లను తొలగించాల్సిన అవసరం లేదని వర్ల రామయ్య తెలిపారు.అడ్డంకులు సృష్టించొద్దని పోలీసులను ఆదేశించాలని ఈసీని వర్ల రామయ్య కోరారు.







