అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శకత్వం లో రూపొందుతున్న పుష్ప 2 సినిమా యొక్క విడుదల తేదీ కోసం తెలుగు సినీ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఉత్తర భారతం లో పుష్ప సినిమా రూ.100 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసిన విషయం తెలిసిందే.కనుక సీక్వెల్ పై అక్కడి వారిలో కూడా ఆసక్తి ఉంది.
ఇంతటి బజ్ క్రియేట్ చేసిన పుష్ప యొక్క సీక్వెల్ విడుదల తేదీ విషయం లో నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ వారు ఒక క్లారిటీ ఇవ్వడం లేదు.అయితే ఈ మధ్య కాలం లో పుష్ప సినిమా ను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మైత్రి మూవీస్ వారు నిర్ణయం తీసుకున్నారని,

షూటింగ్ ముందుగానే పూర్తి అయినా కూడా సంక్రాంతి కానుకగా సినిమా విడుదల అయితే ఎక్కువ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉందని దర్శకుడు సుకుమార్ మరియు అల్లు అర్జున్ భావిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.పైగా మొన్న సంక్రాంతి కి మైత్రి మూవీస్ వారు ఏకంగా రెండు సినిమాలను ఒక్క రోజు గ్యాప్ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి మంచి లాభాలను సొంతం చేసుకున్నారు.కనుక మైత్రి వారికి కూడా సెంటిమెంట్ కలిసి వస్తుందనే ఉద్దేశం తో సంక్రాంతి కి పుష్ప 2 సినిమా ను విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారంటూ ప్రచారం జరుగుతుంది.

అసలు విషయం ఏంటి అనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.మరో వైపు ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా వచ్చే సంక్రాంతి కి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం మొదలైంది.ఒక వేళ ప్రభాస్ సినిమా కనుక సంక్రాంతికి విడుదల అయితే అల్లు అర్జున్ పుష్ప సినిమా కి కొత్త విడుదల తేదీ చూసుకోవాల్సి రావచ్చు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఒకవేళ సంక్రాంతి మిస్ అయితే 2024 సమ్మర్లో పుష్ప విడుదల అయ్యే అవకాశం ఉంది.







