టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సాయిపల్లవి ప్రస్తుతం పరిమితంగా సినిమాలలో నటించడం ఫ్యాన్స్ ను బాధ పెడుతున్న సంగతి తెలిసిందే.వరుస ఫ్లాపులతో తెలుగులో సాయిపల్లవి హవా తగ్గగా తెలుగులో సాయిపల్లవి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.
తమిళంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సాయిపల్లవి తెలుగు సినిమాల విషయంలో మాత్రం ఈ విధంగా వ్యవహరించడం హాట్ టాపిక్ అవుతోంది.
సరైన కథలను ఎంచుకోలేక పోవడం వల్లే సాయిపల్లవి సినిమాల విషయంలో ఈ విధంగా చేస్తున్నారని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
సాయిపల్లవి తెలుగు సినిమాలలో నటిస్తారో లేదో తెలియాల్సి ఉందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.అభినయానికి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే సాయిపల్లవి నటించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం తమిళంలో శివకార్తికేయన్ కు జోడీగా ఆమె నటిస్తున్నారు.

రీమేక్ సినిమాలలో నటించడం కూడా సాయిపల్లవికి నచ్చదనే సంగతి తెలిసిందే.సాయిపల్లవి గ్యాప్ ఇస్తే తెలుగు ప్రేక్షకులు సైతం ఆమెను మరిచిపోయే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉంటాయని కొంతమంది సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.పుష్ప2 సినిమాలో సాయిపల్లవి నటిస్తారని జోరుగా ప్రచారం జరిగినా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని ఇప్పటికే తేలిపోయింది.

మలయాళంలో ఒక సినిమాకు కూడా సాయిపల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో కూడా నిజానిజాలు తెలియాల్సి ఉంది.సాయిపల్లవి పారితోషికం 2 కోట్ల రూపాయలకు అటూఇటుగా ఉంది.2023 సాయిపల్లవికి కలిసొస్తుందో లేదో అని కొంతమంది కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.సాయిపల్లవికి ధీటుగా నటించలేమని కొంతమంది స్టార్ హీరోలు భావిస్తున్నట్టు బోగట్టా.
గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉండటం కూడా సాయిపల్లవికి మైనస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.







