ఏపీలో పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది.
ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా సన్నరెడ్డి దయాకర్ రెడ్డి బరిలో నిలవనున్నారు.కడప -అనంతపురం – కర్నూలు పట్టభద్రుల బీజేపీ అభ్యర్థిగా నంగరూరు రాఘవేంద్ర, శ్రీకాకుళం – విజయనగరం – విశాఖ పట్టభద్రుల అభ్యర్థిగా పీవీఎన్ మాధవ్ లను ప్రకటించింది.
మరోవైపు తెలంగాణలోనూ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు అభ్యర్థిని బీజేపీ ప్రకటించింది.మహబూబ్ నగర్ – రంగారెడ్డి -హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వెంకట నారాయణ రెడ్డి పోటీ చేయనున్నారని బీజేపీ వెల్లడించింది.







