నేడు ప్రేమికుల దినోత్సవం కావున జియో ప్రేమికులకు ఓ బంపర్ ఆఫర్ ప్రకటించింది.వాలెంటైన్స్ డే 2023 సందర్భంగా తన వినియోగదారుల ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకు వచ్చింది.Jio ప్రకటించిన ఈ ఆఫర్ కింద వినియోగదారులు ఎవరైనా రూ.349, రూ.899 అలాగే రూ.2999 జియో ప్లాన్‌తో ఒక్కసారి రీఛార్జ్ చేసుకుంటే వినియోగదారుడు అదనపు డేటాతోపాటు మరిన్ని ప్రయోజనాలను పొందే వీలుంది.వినియోగదారులు రూ.199 కొనుగోలుపై రూ.105, ఫెర్న్స్‌లో రూ.799 కొనుగోలు చేస్తే రూ.150, 75 జీబీ హై-స్పీడ్ డేటా, 12 జీబీ హై-స్పీడ్ డేటా, మెక్‌డొనాల్డ్ మెక్‌ఆలూ టిక్కీ/చికెన్ కబాబ్ బర్గర్ రూ.105 ఉచితంగా లభిస్తాయి.
ఇక ఇక్సిగో నుంచి రూ.4500 లేదా అంతకంటే ఎక్కువ కొనుగోళ్లపై పెటల్స్ ఫ్లాట్ పై రూ.750 వరకు తగ్గింపు లభించనుంది.ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌తో 2.5 GB హై-స్పీడ్, అపరిమిత లోకల్, STD కాలింగ్, రోజుకు 100 SMSలు ప్రతిరోజూ మీరు పంపించుకోవచ్చు.ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.ఈ ప్లాన్‌తో వినియోగదారులు 12 GB అదనపు డేటాతో పాటు ఇతర ప్రయోజనాలను కూడా పొందుతారు.899 రూపాయల ఈ జియో రీఛార్జ్ ప్లాన్‌తో 2.5 GB హై-స్పీడ్ డేటా, అపరిమిత కాలింగ్, రోజువారీ 100 SMS సౌకర్యాన్ని కంపెనీ అందిస్తోంది.
అయితే ఈ ప్లాన్‌తో కూడా, వినియోగదారులకు ఇతర ప్రయోనానాలు కూడా లభించనున్నాయి.రూ.2999 జియో ప్లాన్‌తో 12 GB అదనపు డేటా సౌకర్యం, రోజుకు 2.5 GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMSలను 365 రోజుల పాటు పొందుతారు.వాలెంటైన్స్ డే ఆఫర్ కింద, ఈ ప్లాన్ 23 రోజుల అదనపు చెల్లుబాటుతోపాటు 75GB అదనపు డేటా, మెక్‌డొనాల్డ్స్, ఫెర్న్ & పెటల్‌తో 12GB అదనపు డేటా, విమాన బుకింగ్‌లపై రూ.750 తగ్గింపును అందిస్తోంది.