సురక్షితమైన ప్రయాణానికి రైల్వేలు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తాయి.అంతేకాకుండా బస్సులు, విమానాలతో పోలిస్తే దీని టికెట్ ధర కూడా ఎక్కువే.
దీంతో ఎక్కువ మంది రైళ్ల ప్రయాణాలకు ఇష్టపడుతుంటారు.అయితే కొన్ని సార్లు అభివృద్ధి పనులు, మరమ్మతు పనుల వల్ల రైళ్లు క్యాన్సిల్ అవుతుంటాయి.
తాజాగా సౌత్ సెంట్రల్ రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.మరమ్మతు పనుల కారణంగా జోన్ పరిధిలో ఆరు రైళ్లను పూర్తిగా, నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే శనివారం ప్రకటించింది.
మార్చి 1 వరకు ఈ రైళ్లను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.వాటి వివరాలు తెలుసుకుందాం.

ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు గుంటూర్-కాచిగూడ (రైలు నంబరు 17251) రైలు, ఫిబ్రవరి 12 నుండి మార్చి 1 వరకు కాచిగూడ-గుంటూర్ (రైలు నంబరు 17252), కాచిగూడ-మెదక్ (రైలు నంబరు 07577) రైలు ఫిబ్రవరి 13వ తేదీ నుండి మార్చి 1 వరకు, మెదక్-కాచిగూడ (రైలు నంబరు07578) ఫిబ్రవరి 13 నుండి మార్చి 1 వరకు ఈ రైళ్లు రద్దు చేసినట్లు ప్రకటించారు.ఇక కొన్ని రైళ్లు పాక్షికంగా రద్దు చేయబడ్డాయి.ఆ జాబితాలో గుంటూర్-సికింద్రాబాద్ (రైలు నంబరు 17253) ఎక్స్‌ప్రెస్ ఈ నెల 19 నుండి 28 వరకు గుంటూర్-దొనకొడ మధ్య మార్గంలో పాక్షికంగా రద్దు చేశారు.

ఫిబ్రవరి 18-27 వరకు దొనకొడ-గుంటూరు మధ్య ప్రాంతంలో సికింద్రాబాద్-గుంటూర్ (రైలు నంబరు 17254) ఎక్స్‌ప్రెస్ రాకపోకలు రద్దు చేశారు.గుంటూర్ -డోన్ (రైలు నంబరు 17228) రైలును ఫిబ్రవరి 12 నుండి ఫిబ్రవరి 28 వరకు, డోన్-గుంటూర్ (రైలు నంబరు 17227) ట్రైన్‌ను ఫిబ్రవరి 13 నుంచి మార్చి 1 మధ్య రద్దు చేశారు.గుంటూర్-తిరుపతి మధ్య నడిచే (రైలు నంబరు 17261) రైలును ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఫిబ్రవరి 28 వరకు, తిరుపతి-గుంటూరు మధ్య నడిచే (రైలు నంబరు 17262)ను గుంటూర్-మార్కాపురం స్టేషన్లలో ఫిబ్రవరి 18-27 నుండి తేదీల మధ్య రాకపోకలు నిలిపి వేశారు.







