తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.కేంద్రంపై బురద జల్లేందుకు అసెంబ్లీని కేసీఆర్ ఉపయోగించుకున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలేనన్న కిషన్ రెడ్డి అసత్యాలను ప్రచారం చేయడంలో కేసీఆర్ దిట్టని ఆరోపించారు.అసెంబ్లీ వేదికగా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని మండిపడ్డారు.
కేసీఆర్ కు దమ్ము, ధైర్యం ఉంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించాలని డిమాండ్ చేశారు.అనంతరం అసెంబ్లీలో ప్రభుత్వ వైఫల్యాలపై ఎందుకు చర్చ జరగలేదని ప్రశ్నించారు.
రాష్ట్రంలో కుటుంబ పాలన పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు.బీజేపీ అధికారంలోకి వస్తుందేమోనని కేసీఆర్ కు భయం పట్టుకుందని విమర్శించారు.







