సందీప్ కిషన్ సినిమాలో ఆ సీన్ కి థియేటర్ లో లేచి నిలబడి సెల్యూట్ చేశారు అది ఏ సినిమా అంటే

సినిమాలు చేసిన మొదట్లోనే నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు.

ప్రస్థానం సినిమాలో ఈయన చేసిన పాత్ర కి మంచి పేరు వచ్చింది ఆ తర్వాత రొమాంటిక్ లవ్ స్టోరీ లాంటి సినిమాలు తీసాడు అవి పర్వాలేదు అనిపించాయి దాంతో మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో చేసిన వేంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా ఇచ్చిన జోష్ తో సందీప్ కిషన్ వరుసగా సినిమాలు చేస్తూ వచ్చాడు దాంట్లో చాలా వరకు సినిమాలు బాక్సఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచాయి.ముఖ్యంగా ఆయన సెలెక్ట్ చేసుకునే స్టోరీ లే అందుకు కారణం అని తెలుస్తుంది.ఈ విషయం పక్కన పెడితే రాజాసింహ తడినడా అనే రైటర్, డైరెక్టర్ గా మారి సందీప్ కిషన్ తో ఒక్క అమ్మాయి తప్ప అనే సినిమా చేసాడు దింట్లో నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించింది

ఈ సినిమా మొత్తం ఒక ఫ్లైఓవర్ మీదనే ఉంటుంది.ఒక ముస్లిం ఫ్లైఓవర్ కింద బాంబ్ పెట్టడానికి వెళ్తాడు కానీ రోడ్ మీద ఆయన చూసిన దేశ ప్రజలందరూ కలిసి ఉండటం చూసి నేను ఆ పని చేయలేను అని తనికెళ్ళ భరణి గారికి వచ్చి చెప్తాడు దాంతో భరణి గారు ఇండియా గురించి ఇక్కడి మనుషుల గురించి చెప్తుంటే థియేటర్ లో కూర్చున్న జనాలు అంత లేచి నిల్చొని చప్పట్లు కొట్టారట.

అలా దేశభక్తి ని చాటే సినిమాల్లో ఇలాంటి మంచి మాటలు వింటుంటే దేశ ప్రజలు కూడా గొడవలు పెట్టుకోరు అని ఆ సినిమా చూసిన చాలా మంది చెప్పారు ఈ సినిమా ప్లాప్ అయినప్పటికీ ఈ సినిమాలో ఈ ఒక్క సీన్ మాత్రం బాగా హిట్ అయింది.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు