వాట్సాప్ అప్డేట్స్ మీద అప్డేట్స్ ఇచ్చేస్తోంది... తాజా ఫీచర్ తో ఏకంగా 100 మందికి!

ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్ దాదాపుగా రోజుకో అప్డేట్ ఇస్తూ పోతోంది.ఈ క్రమంలోనే తాజాగా మరో కొత్త ఫీచర్ను తీసుకువచ్చింది.

 Whatsapp Is Giving Updates On Updates... 100 People Simultaneously With The Late-TeluguStop.com

ఆ ఫీచర్ ద్వారా ఏకకాలంలో 100 మీడియా ఫైల్స్ ను ఒకేసారి షేర్ చేసేలా యాప్ ను అప్డేట్ చేసింది.కాగా ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఎంపికచేసిన అతికొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులో వున్నట్టుగా గోచరిస్తోంది. వాట్సాప్ యాప్ ను అప్ డేట్ చేసుకున్న, ఆండ్రాయిడ్ 2.23.4.3 (android 2.23.4.3 version) వర్షన్ తో ఉన్న బీటా యూజర్లకు ప్రస్తుతానికి ఈ ఫీచర్ అందుబాటులో ఉన్నట్టు సమాచారం.

Telugu Messges, Chat, Latest, Status, Ups, Whatsapp-Latest News - Telugu

ఇక దానికోసం WhatsApp యూజర్లు ముందుగా, గూగుల్ ప్లే స్టోర్ లోని వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ డౌన్లోడ్ చేసుకోవలసి ఉంటుంది.అలాగే సమీప భవిష్యత్తులో మిగతా యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.అయితే ఎప్పుడు వస్తుంది అనే విషయం మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

ఇంకా అధికారికంగా ఓ ప్రకటన వెలువడాల్సి వుంది.WhatsApp లో ఒకేసారి 30కి పైగా మీడియా ఫైల్స్ ను షేర్ చేయడానికి ప్రయత్నించడం ద్వారా ఈ ఫీచర్ సదరు యూజర్లకు అందుబాటులో ఉందో, లేదో తెలుసుకోవచ్చు.

Telugu Messges, Chat, Latest, Status, Ups, Whatsapp-Latest News - Telugu

ఈ ట్రయిల్ లో మీరు 30కి పైగా మీడియా ఫైళ్లను ఒకేసారి, షేర్ చేయగలిగితే మాత్రం ఇక 100 ఫైళ్ల వరకు షేర్ చేసే సదుపాయాన్ని పొందినట్టే.ఇక్కడ ప్రతీసారి వేర్వేరుగా ఫొటోలు, లేదా మీడియా ఫైల్స్ ను షేర్ చేసే బదులు ఒకే క్లిక్ తో మొత్తం అల్బమ్ ను ఈ ఫీచర్ ద్వారా షేర్ చేసుకొనే వెసులుబాటు ఉంటుందని గుర్తుపెట్టుకోండి.ఇదే కాకుండా, మరికొన్ని కొత్త, యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను కూడా వాట్సాప్ ఎప్పటికప్పుడు మెరుగు పరుస్తూ వస్తోంది.గ్రూప్స్ చాట్స్, ఇండివిడ్యువల్ చాట్స్ లో ముఖ్యమైన సందేశాలను ఇకపై ప్రత్యేకంగా పిన్ చేసుకోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube