విలక్షణ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మరియు లవ్ స్టోరీ సినిమాల్లో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.ఆయన తదుపరి సినిమా ధనుష్ తో రూపొందాల్సి ఉండగా అది క్యాన్సిల్ అయింది.
అదే కథ తో ప్రస్తుతం అక్కినేని హీరో నాగ చైతన్య హీరో గా శేఖర్ కమ్ముల దర్శకత్వం లో సినిమా రూపొందుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ సమయం లో దర్శకుడు శేఖర్ కమ్ముల మరో సారి హీరోయిన్ గా సాయి పల్లవి ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గత కొన్నాళ్లుగా సాయి పల్లవి సినిమాలు చేయడం లేదు.ముఖ్యంగా తెలుగు సినిమా లకు కమిట్ అవ్వడం లేదు.
ఇటీవల ఒక తమిళ సినిమా చేసేందుకు ఒప్పుకున్న సాయి పల్లవి తెలుగు లో లేడీ ఓరియంటెడ్ సినిమా లు కానీ కమర్షియల్ సినిమాలు కానీ అసలు కమిట్ అవ్వలేదు.దాంతో ఆమె తెలుగు సినిమాలను చేసే ఉద్దేశం తో లేదేమో అనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం నాగ చైతన్య మరియు శేఖర్ కమ్ముల కాంబినేషన్ సినిమా పట్టాలెక్కెందుకు రెడీ అవుతుంది.కనుక ఆ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయంటూ కొందరు అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కానీ సాయి పల్లవి మాత్రం తెలుగు లో ఇప్పటి వరకు నటించేందుకు ఆసక్తి చూపించడం లేదు.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న నాగ చైతన్య మరియు శేఖర్ కమ్ముల సినిమా లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తే కచ్చితంగా ఆ సినిమా క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం ఉంది.
లేడీ పవర్ స్టార్ అంటూ పేరు దక్కించుకున్న సాయి పల్లవి కచ్చితం గా తెలుగు లో ఈ సినిమాలు చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.శేఖర్ కమ్ముల ఆమె ను తిరిగి తెలుగు ప్రేక్షకుల ముందు తీసుకొస్తే ఆయన కు ఫ్యాన్స్ కృతజ్ఞతలు చెబుతారు.







