నందమూరి బాలకృష్ణ ఇటీవల వీర సింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.సంక్రాంతి కి విడుదలైన వీర సింహారెడ్డి 100 కోట్ల కు పైగా కలెక్షన్స్ నమోదు చేసి బాలయ్య కెరియర్ లో మరో సూపర్ హిట్ గా నిలిచింది.
ఈ సమయం లో బాలయ్య చేస్తున్న సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.వీర సింహా రెడ్డి స్థాయిలోనే బాలకృష్ణ తదుపరి సినిమా ఉంటుందని అంతా చాలా నమ్మకంతో ఉన్నారు.
ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వం లో బాలకృష్ణ సినిమా యొక్క హీరోయిన్ విషయమే ఆసక్తికర చర్చ జరుగుతుంది.బాలయ్య కు జోడీగా ఆ మధ్య పలువురు హీరోయిన్స్ పేర్లు వినిపించాయి.
చివరకు కాజల్ అగర్వాల్ పేరు ను ఖరారు చేశారు అని వార్తలు జోరుగా వస్తున్నాయి.
తాజాగా కాజల్ అగర్వాల్ ఈ సినిమా కోసం తీసుకుంటున్న రెమ్యూనరేషన్ గురించి ప్రచారం జరుగుతుంది.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కాజల్ అగర్వాల్ ఏకంగా కోటి రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. కాజల్ అగర్వాల్ యొక్క రెమ్యూనరేషన్ ఒకప్పుడు కోటికి పైగానే ఉండేది.
కానీ ఇప్పుడు ఆమెకు పెళ్లి అయి ఒక బాబు కూడా ఉన్నాడు.ఇలాంటి సమయం లో ఆమెకు రెమ్యూనరేషన్ గా కోటి రూపాయలు దక్కడం అంటే మామూలు విషయం కాదు.
బాలకృష్ణ సినిమా లో నటించే అవకాశం రావడం తో పాటు కోటి రూపాయల రెమ్యూనరేషన్ దక్కింది అంటే ఆమె కచ్చితంగా ఈ ఆఫర్ తో లక్కీ ఆఫర్ సొంతం చేసుకున్నట్లే అంటూ సినీ విశ్లేషకులు మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుంది.ఆ విషయమై క్లారిటీ ఇచ్చేందుకు దర్శకుడు అనిల్ రావిపూడి ఏర్పాట్లు చేస్తున్నాడు.