బిగ్ బాస్ సీజన్ 2 ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరై ఎంతో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న దీప్తి సునయన గురించి అందరికీ తెలిసిందే.హౌస్ లో ఉన్నంత కాలం తన అల్లరితో, ఎమోషనల్ తో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది.
దీప్తి బిగ్ బాస్ షో కంటే ముందు డబ్ స్మాష్ వీడియోలతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.
ఆ తర్వాత యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ తో బాగా మెప్పించింది.
అలా అక్కడినుంచి బిగ్ బాస్ లో అవకాశం అందుకోగా తన కెరీర్ మొత్తం బిగ్ బాస్ తో మొదలైందని చెప్పవచ్చు.ఇక బిగ్ బాస్ తర్వాత పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది.
మంచి సక్సెస్ లు అందుకుంది.మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.
అంతేకాకుండా సింగర్ గా తన పాటతో బాగా మెప్పించింది.ఇక దీప్తి సునయనకు మరో సోషల్ మీడియా స్టార్ షణ్ముఖ్ తో ఉన్న సంబంధం గురించి అందరికీ తెలిసిందే.వీరిద్దరూ కలిసి గతంలో కొన్ని కవర్ సాంగ్స్ కూడా చేశారు.అలా వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ షిప్ ఏర్పడింది.కొంతకాలం వరకు వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ లా ఉన్నట్లు అందరినీ నమ్మించారు.
కానీ కొంతకాలం తర్వాత వీరిద్దరి మధ్య లవ్ నడుస్తుందని అనుమానాలు వచ్చాయి.
అంతేకాకుండా టాటులు కూడా ఒకేలా వేయించుకోవటంతో బాగా అనుమానాలు రావడంతో బిగ్ బాస్ సీజన్ 5 తో నిజమైంది.కానీ అందులో షణ్ముఖ్ నెగిటివిటిని మూటగట్టుకున్నాడు.ఆల్రెడీ దీప్తి సునయన తో లవ్ లో ఉన్నాడు.
కానీ షన్ను మరో కంటెస్టెంట్ సిరితో మితిమీరి హద్దులతో ప్రవర్తించడంతో బాగా విమర్శలు ఎదుర్కొన్నాడు.అంతేకాకుండా షో నుండి బయటికి వచ్చాక దీప్తి సునయనను దూరంగా ఉంచటంతో.ఇక షన్ను తో తన రిలేషన్ కరెక్ట్ కాదని బ్రేకప్ చెప్పుకుంది.
ఈ విషయాన్ని తనే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది.
ఇక ఆరోజు నుంచి దీప్తి బాగా ఎమోషనల్ గా ఉంటుంది.
సోషల్ మీడియా వేదికగానే తాను రిఫ్రెష్ అవుతుంది.కొన్ని కొన్ని కొటేషన్స్ తో అందరి దృష్టిని తాకుతుంది.
అప్పుడప్పుడు లవ్ ను ఉద్దేశించి కొన్ని కొన్ని కొటేషన్స్ కూడా పెడుతుంది.ఇక చాలా వరకు తను కూడా సోషల్ మీడియా వేదికగా రిఫ్రెష్ అవుతూ కొత్త లైఫ్ ని ప్రారంభించింది.
ఒకవైపు ఫోటో షూట్లతో బాగా బిజీగా ఉంటూ.మరోవైపు షార్ట్ ఫిలిమ్స్ తో బాగా సందడి చేస్తుంది.ఇటీవలే ఓ వీడియో ఆల్బమ్ చేయగా అది మంచి సక్సెస్ అయ్యింది.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తను ఒక రీల్ చేస్తూ కనిపించింది.అయితే అందులో తాను ఒక డ్రెస్ వేసుకోగా కింద ప్యాంటు వేసుకోలేదు.ఇక ఆ డ్రెస్ చూడ్డానికి అచ్చం పేషంటు లాగా ఉంది.అంతేకాకుండా ఓ సినిమాలో బాబు మోహన్ వేసుకున్నట్లు ఉంది.దీంతో ఆ వీడియో చూసిన వాళ్లంతా బాగా ట్రోల్స్ చేస్తున్నారు.ప్యాంటు వేసుకోవడం మర్చిపోయావా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.