పైకి సైలెంట్ గానే ఉన్నట్టుగా కనిపించినా, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకుంటూ దానిని అధ్యక్షుడు కూడా తప్పకుండా అమలు చేసే విధంగా చక్రం తిప్పగల స్థాయి ఉన్న నేతగా గుర్తింపు పొందారు ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు. మొదటి నుంచి టిడిపిలో యనమాలకు చంద్రబాబు గట్టి ప్రాధాన్య ఇస్తూ వచ్చారు.
ఆయనకు కీలక పదవులను కట్టబెట్టారు.దీనికి తగ్గట్లుగానే చంద్రబాబు వద్ద యనమల తన గౌరవం కాపాడుకుంటూ వచ్చారు.
లోకేష్ రాజకీయంగా యాక్టివ్ కాకముందు వరకు యనమల రామకృష్ణుడు తీవ్రంగా ఉన్నట్టు కనిపించారు.అయితే లోకేష్ పూర్తిగా టిడిపి తరఫున యాక్టివ్ అవుతూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న దగ్గర నుంచి యనమల ప్రాధాన్యం తగ్గినట్టు కనిపించింది.
అయినా చంద్రబాబు మాత్రం యనమల విషయంలో ఎప్పుడూ సానుకూలంగానే స్పందిస్తూ వస్తున్నారు.దీనికి కారణం యనమల రామకృష్ణుడు ఇచ్చే సలహాలు టిడిపికి మేలు చేస్తాయని ,ఆయన భవిష్యత్తు రాజకీయాలను ముందుగా అంచనా వేయడంలో దిట్ట అని చంద్రబాబు ఇప్పటికీ నమ్ముతారు.
అందుకే ఎవరు ఎన్ని చెప్పినా యనమాల విషయంలో బాబు ఎవరి మాట వినరు.ఇక విషయానికొస్తే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నూ రాజకీయ యనమల రామకృష్ణుడు చక్రం తిప్పుతూ ఉంటారు.
అటువంటిది ఆయన తన సొంత నియోజకవర్గమైన తుని విషయంలో ఏ స్థాయిలో చక్రం తిప్పగలరనే విషయం ఇప్పుడు ఉదాహరణగా నిలుస్తుంది.

గత కొద్దిరోజులుగా చూసుకుంటే తుని నియోజకవర్గ టిడిపిలో విభేదాలు తలెత్తాయి.ముఖ్యంగా రామకృష్ణ సోదరుడు యనమల కృష్ణుడుకు ఆయనకు మధ్య దూరం పెరిగింది.దీనికి కారణం యనమల రామకృష్ణుడు తన కుమార్తె దివ్వను 2024 ఎన్నికల్లో టిడిపి తరఫున తుని నియోజకవర్గంలో నుంచి పోటీ చేయించాలని భావించారు.
ఈ మేరకు కొద్ది రోజుల క్రితం జరిగిన తుని పార్టీ కార్యకర్తలు సమావేశంలోనూ ఈ విషయాన్ని చెప్పారు.అయితే ఈ ప్రతిపాదనను ఆయన సోదరుడు కృష్ణుడు అంగీకరించలేదు.
మళ్ళీ తాను టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తానని కొంతమంది నాయకులు వద్ద వ్యాఖ్యానించిన ఆడియో బయటకు లీక్ కావడం కలకలమే రేపింది.

అయితే తన సోదరుడు కంటే తన కుమార్తె దివ్య ను పోటీకి దింపేందుకు నిర్ణయించుకున్న రామకృష్ణుడు ఇదే విషయాన్ని చంద్రబాబు వద్ద ప్రస్తావించారట.రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు కూడా చంద్రబాబు వద్ద మంతనాలు చేశారట.తనకే మళ్ళీ టికెట్ ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారట.
ఇప్పటికే రెండుసార్లు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కృష్ణుడు ఓటమి చెందడం తో బాబు యనమల రామకృష్ణుడు ప్రతిపాదనకే మొగ్గు చూపారు.ఈ మేరకు టిడిపి తుని నియోజకవర్గ ఇన్చార్జిగా దివ్య ను నియమిస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించడంతో రామకృష్ణుడి సత్తా ఏమిటనేది మరోసారి తేలిపోయింది.