ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే.ఈ ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా, మెగా కాంపౌండ్ నుంచి నిహారిక సుస్మిత వంటి వారు నిర్మాతలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.
ఈ క్రమంలోనే చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత తన తండ్రి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేయడమే కాకుండా నిర్మాతగా కూడా వెబ్ సిరీస్ లను సినిమాలను నిర్మిస్తున్నారు.ఈ క్రమంలోనే గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సంతోష్ శోభన్ గౌరి జి.కిషన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’.
ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫిబ్రవరి 18వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది ఈ క్రమంలోనే నిర్మాత సుస్మిత మీడియా సమావేశంలో ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.సంతోష్ శోభన్ తనకు ఒక కాఫీ షాప్ లో పరిచయమయ్యారని అప్పటి పరిచయమైన మా ప్రయాణం ఇంతవరకు కొనసాగుతూ వచ్చిందని తెలిపారు.శ్రీదేవి శోభన్ బాబు చిన్న ఆలోచనతో మొదలైన ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో మనసుపెట్టి పని చేశామని సుస్మిత తెలిపారు.
మా అందరిలోని ఇన్నోసెంట్ ఎమోషన్స్ అన్నీ స్క్రిప్ట్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యింది.సిటీలో పుట్టి పెరిగిన సంతోష్ లాంటి ఒక హీరో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలో ఎంతో అద్భుతంగా నటించారు.ఇక హీరోయిన్ కు తెలుగు రాకపోయినా ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకొని ఎంతో అద్భుతంగా నటించారని తెలిపారు.ఇలా ఈ సినిమా ఎంతో అద్భుతంగా వచ్చిందని నా మనసుకు దగ్గరైన సినిమా ఇది అంటూ సుస్మిత ఈ సందర్భంగా శ్రీదేవి శోభన్ బాబు సినిమా గురించి పలు ఆసక్తికరమైన విషయాలు తెలిపారు.