సీనియర్ రచయిత సినీ నటుడు పోసాని కృష్ణ మురళి నేడు ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.
పదవుల కోసం రాజకీయాల్లోకి రాలేదని చెప్పుకొచ్చారు.జగన్ ని దూరం నుంచి చూసి వచ్చానని తెలిపారు.
సాధారణంగా నాయకులు.కులాలు, మతాలు, డబ్బుల్లో నుంచి పుడుతుంటారు కానీ వైయస్ జగన్ వారికి భిన్నంగా జనం నుంచి పుట్టిన లీడర్ అని అభివర్ణించారు.
ముఖ్యంగా జగన్ వ్యక్తిత్వం అంటే చాలా ఇష్టం అని అందుకే ఆయనతో స్నేహం చేసినట్లు తెలిపారు.ప్రజల నుంచి ఆయనను ఎవరు వేరు చేయలేరని పోసాని కృష్ణమురళి వ్యాఖ్యానించారు.
చచ్చేవరకు జగన్ తోనే ఉంటానని వైసీపీ జెండా మోస్తానని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆయన స్వీటెస్ట్.హాటెస్ట్ మరియు హానెస్ట్.గ్రేటెస్ట్.
ఎవరెస్టు.వ్యక్తి కాబట్టి ఆయన ఇచ్చిన ఈ పదవిని తీసుకున్నట్లు స్పష్టం చేశారు.తెలుగు చలనచిత్ర పరిశ్రమ తనకు ఎంతో మంచి చేసింది.ఈ సందర్భంగా సినీ పరిశ్రమకు ఎంత మంచి చేస్తానో తెలియదు కానీ చెడు మాత్రం చేయను.మోసాలు చేయను అబద్ధాలు చెప్పను.వైయస్ జగన్ కి చెడ్డపేరు తీసుకురాకుండా ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తానని పోసాని స్పష్టం చేశారు.
ఏపీఎఫ్‌డీసీ చైర్మన్ గా పోసాని పదవి స్వీకరణ కార్యక్రమానికి వైసీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పేర్ని నాని, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు చల్ల మధుసూదన్ రెడ్డి, తెలుగు అకాడమీ చైర్ పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతి కొలువురు నాయకులు హాజరయ్యారు.







