వాట్సాప్ యూజర్లకు మరో శుభవార్త... మెసేజెస్ ఇలా దాచేసుకోండి!

ప్రముఖ సోషల్ మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్ వినియోగదారులను ఆకర్శించడానికి ఎప్పటికప్పుడు కొత్తకొత్త అప్డేట్స్ తెస్తూనే వుంది.ఈ క్రమంలో గత సంవత్సరం కస్టమర్లకు ఎన్నో రకాల ఉపయోగకరమైన ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ ఈ సంవత్సరంలో కూడా మరిన్ని ఫీచర్లను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది.

 Whatsapp To Allow Saving Disappearing Messages Feature,whatsapp,disappearing Mes-TeluguStop.com

వాట్సప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం ఈ మెసేజింగ్ యాప్ డిసప్పియరింగ్ మెసేజెస్‌ను టెంపరరీగా సేవ్ చేసుకునేందుకు ఒక ఫీచర్ని తీసుకొచ్చే పనిలో పడిందని తెలుస్తోంది.

Telugu Messages, Message, Save Chat, Ups, Un Messages, Whatsapp-Latest News - Te

మనం బేసిగ్గా ఏదైనా వాట్సప్ చాట్‌కు డిసప్పియరింగ్ మెసేజెస్‌ ఆప్షన్ అనేదానిని ఆన్ చేస్తే.ఆ చాట్‌లోని మెసేజ్‌లన్నీ ఒక పర్టికులర్ టైమ్‌ తర్వాత డిలీట్ అయిపోతుంటాయి కదా.అలా కాకుండా Disappearing Messages ఆన్ చేసినా ఆ చాట్‌లోని మెసేజెస్ సేవ్ చేసుకునేలా వాట్సప్ ఈ ఫీచర్‌ను డెవలప్ చేసే పనిలో పడిందన్నమాట.డిసప్పియరింగ్ మెసేజెస్‌ ని సేవ్ చేసే ఫీచర్‌ను Kept Messageగా వాట్సప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ చేయడం కొసమెరుపు.కాగా ఈ కెప్ట్ మెసేజెస్ లేదా సేవ్డ్‌ మెసేజెస్ ఫీచర్‌ను ఉపయోగించి చాట్‌లోని డిసప్పియరింగ్ మెసేజెస్‌ను తాత్కాలికంగా సేవ్ చేయవచ్చు.

Telugu Messages, Message, Save Chat, Ups, Un Messages, Whatsapp-Latest News - Te

అంటే ఇక్కడ అర్ధం చేసుకోవలసిన విషయం ఏమంటే సేవ్ చేసిన డిసప్పియరింగ్ మెసేజ్‌లు చాట్ నుంచి ఆటోమేటిక్‌గా ఇకనుండి డిలీట్ కానేకావు.యూజర్లు ఈ మెసేజ్‌లు అవసరం లేదనుకుంటే వాటిని ఏ సమయంలోనైనా “అన్-కీప్” చేసుకోవచ్చు.అయితే సదరు ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లోనే ఉంది.దీనిని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపైనా ఇంకా క్లారిటీ రావలసి వుంది.వాట్సప్ బీటా ఇన్ఫో తన లేటెస్ట్ రిపోర్ట్‌లో ఈ ఫీచర్‌ పనితీరుకు సంబంధించి ఒక స్క్రీన్‌షాట్‌ కూడా షేర్ చేసింది.ఈ స్క్రీన్‌షాట్‌లో వాట్సప్‌లో కెప్ట్ మెసేజెస్‌తో సేవ్ చేసిన ఒక మెసేజ్ చూడవచ్చు.

అలానే డిసప్పియరింగ్ మెసేజ్ బబుల్‌లో కనిపించే బుక్‌మార్క్ ఐకాన్ గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube