వాట్సాప్ యూజర్లకు మరో శుభవార్త… మెసేజెస్ ఇలా దాచేసుకోండి!

ప్రముఖ సోషల్ మెసేజింగ్ దిగ్గజ యాప్ వాట్సాప్ వినియోగదారులను ఆకర్శించడానికి ఎప్పటికప్పుడు కొత్తకొత్త అప్డేట్స్ తెస్తూనే వుంది.

ఈ క్రమంలో గత సంవత్సరం కస్టమర్లకు ఎన్నో రకాల ఉపయోగకరమైన ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ ఈ సంవత్సరంలో కూడా మరిన్ని ఫీచర్లను రిలీజ్ చేయడానికి సిద్ధమైంది.

వాట్సప్ బీటా ఇన్ఫో లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, ప్రస్తుతం ఈ మెసేజింగ్ యాప్ డిసప్పియరింగ్ మెసేజెస్‌ను టెంపరరీగా సేవ్ చేసుకునేందుకు ఒక ఫీచర్ని తీసుకొచ్చే పనిలో పడిందని తెలుస్తోంది.

"""/"/ మనం బేసిగ్గా ఏదైనా వాట్సప్ చాట్‌కు డిసప్పియరింగ్ మెసేజెస్‌ ఆప్షన్ అనేదానిని ఆన్ చేస్తే.

ఆ చాట్‌లోని మెసేజ్‌లన్నీ ఒక పర్టికులర్ టైమ్‌ తర్వాత డిలీట్ అయిపోతుంటాయి కదా.

అలా కాకుండా Disappearing Messages ఆన్ చేసినా ఆ చాట్‌లోని మెసేజెస్ సేవ్ చేసుకునేలా వాట్సప్ ఈ ఫీచర్‌ను డెవలప్ చేసే పనిలో పడిందన్నమాట.

డిసప్పియరింగ్ మెసేజెస్‌ ని సేవ్ చేసే ఫీచర్‌ను Kept Messageగా వాట్సప్ బీటా ఇన్ఫో రిపోర్ట్ చేయడం కొసమెరుపు.

కాగా ఈ కెప్ట్ మెసేజెస్ లేదా సేవ్డ్‌ మెసేజెస్ ఫీచర్‌ను ఉపయోగించి చాట్‌లోని డిసప్పియరింగ్ మెసేజెస్‌ను తాత్కాలికంగా సేవ్ చేయవచ్చు.

"""/"/ అంటే ఇక్కడ అర్ధం చేసుకోవలసిన విషయం ఏమంటే సేవ్ చేసిన డిసప్పియరింగ్ మెసేజ్‌లు చాట్ నుంచి ఆటోమేటిక్‌గా ఇకనుండి డిలీట్ కానేకావు.

యూజర్లు ఈ మెసేజ్‌లు అవసరం లేదనుకుంటే వాటిని ఏ సమయంలోనైనా "అన్-కీప్" చేసుకోవచ్చు.

అయితే సదరు ఫీచర్ ఇంకా డెవలప్‌మెంట్‌ స్టేజ్‌లోనే ఉంది.దీనిని ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపైనా ఇంకా క్లారిటీ రావలసి వుంది.

వాట్సప్ బీటా ఇన్ఫో తన లేటెస్ట్ రిపోర్ట్‌లో ఈ ఫీచర్‌ పనితీరుకు సంబంధించి ఒక స్క్రీన్‌షాట్‌ కూడా షేర్ చేసింది.

ఈ స్క్రీన్‌షాట్‌లో వాట్సప్‌లో కెప్ట్ మెసేజెస్‌తో సేవ్ చేసిన ఒక మెసేజ్ చూడవచ్చు.

అలానే డిసప్పియరింగ్ మెసేజ్ బబుల్‌లో కనిపించే బుక్‌మార్క్ ఐకాన్ గమనించవచ్చు.

వరంగల్ కు నేడు కేసీఆర్ .. కాంగ్రెస్ కీలక నేతలతో నేడు రేవంత్ భేటీ