నిఖిల్ 3 సినిమాలు 3 జోనర్లు..!

యువ హీరో నిఖిల్ కార్తికేయ 2 తో నేషనల్ వైడ్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు.

కార్తికేయ 1 ఆల్రెడీ సూపర్ హిట్ కాగా ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 మాత్రం పాన్ ఇండియా రేంజ్ లో సెన్సేషనల్ గా నిలిచింది.

నిఖిల్ కెరీర్ లో 100 కోట్ల సినిమాగా కార్తికేయ 2 నిలిచింది.ఆ ఉత్సాహంతోనే కార్తికేయ 3 కూడా సిద్ధం చేస్తున్నారు.

ఇక కార్తికేయ 2 తర్వాత నిఖిల్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో 18 పేజెస్ అనే సినిమాతో వచ్చాడు.సుకుమార్ కథ అందించిన ఈ సినిమాను సూర్య ప్రతాప్ డైరెక్ట్ చేశారు.

థియేట్రికల్ రిలీజ్ కూడా హిట్ అనిపించుకున్న 18 పేజెస్ సినిమా రీసెంట్ గా ఓటీటీ రిలీజైంది.ఆహా ఓటీటీలో రిలీజైన 18 పేజెస్ రికార్డులు సృష్టిస్తుంది.100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ తో నిఖిల్ 18 పేజెస్ హడావిడి చేస్తుంది.సినిమాను థియేటర్ లో చూడని చాలామంది ఓటీటీలో చూసి సూపర్ అనేస్తున్నారు.

Advertisement

అయితే నిఖిల్ ఈ సినిమా తర్వాత స్పై సినిమా చేస్తున్నాడు.టైటిలే స్పై అని పెట్టాడంటే సినిమా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

వరుస నిఖిల్ 3 సినిమాలు చూస్తే కార్తికేయ 2 డిఫరెంట్ స్టోరీ కాగా 18 పేజెస్ లవ్ స్టోరీ.స్పై సినిమా థ్రిల్లర్ జోనర్ లో వస్తుంది.

ఇలా 3 సినిమాలు 3 జోనర్లు చేయడం చాలా అరుదని చెప్పొచ్చు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు