పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నేడు పూజా కార్యక్రమాలు జరుపుకుంది.సుజిత్ డైరెక్షన్ లో పవన్ సినిమా చేస్తున్నారు.
ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు.గ్యాంగ్ స్టర్ కథతో రాబోతున్న ఈ సినిమాకు హ్యాష్ ట్యాగ్ ఓజీ అనే టైటిల్ నే ప్రచారానికి వాడుతున్నారు.
దాదాపు సినిమా టైటిల్ కూడా ఇదే అని ఇన్నర్ టాక్.ఓజీ అనే టైటిల్ నే ఫిక్స్ చేసినట్టు చెప్పుకుంటున్నారు.
మాములుగా పవన్ తన ప్రతి సినిమాకు తెలుగు టైటిల్స్ ని పెడుతుంటారు.

కానీ ఈసారి కొత్తగా ఓజీ అంటూ ఇంగ్లీష్ టైటిల్ కే ఓటు వేసినట్టు తెలుస్తుంది.సినిమా టైటిల్ అదే అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండుగ అన్నట్టే లెక్క.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమా చేస్తున్నారు.
అది పూర్తి కాగానే హరీశ్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్.సుజిత్ తో ఓజీ రెండు సినిమాలు ఒకేసారి పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు.
మధ్యలో వినోదయ సీతం రీమేక్ కూడా ప్లాన్ చేస్తున్నారు.ఏది ఏమైనా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా పవన్ తన సినిమాలు పూర్తి చేసి రాబోయే ఎలెక్షన్స్ ప్రచారంలో పాల్గొననున్నారు.