శాకుంతలం సినిమా కోసం సమంత తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

సమంత శాకుంతలం సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఫిబ్రవరి 17వ తారీకున శాకుంతలం సినిమా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే.

 Samantha Remuneration For Shakuntalam Movie , Samantha , Tollywood, Remunerat-TeluguStop.com

ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ అయ్యాయి.మెల్లగా సమంత కూడా ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో జాయిన్ అవ్వబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సమంత ఈ సినిమా కోసం సరిగ్గా మూడు నెలలు మాత్రమే షూటింగ్‌ లో పాల్గొంది.ఈ సినిమా లో ఎక్కువగా గ్రాఫిక్స్ షాట్స్ ఉన్నాయట.

దాంతో సమంత ఎక్కువగా కష్టపడకుండానే ఈజీగా వర్క్ అయ్యిందని తెలుస్తోంది.ఇక ఈ సినిమా కోసం సమంత తీసుకున్న పారితోషికం ఎంత అంటూ అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Telugu Allu Arha, Dil Raju, Gunasekhar, Gunashekhar, Samantha, Shakuntalam, Toll

సాధారణంగా హీరోయిన్ గా సమంత తీసుకునే పారితోషికం రెండు కోట్లు.కానీ ఈ సినిమా కోసం సమంత ఏకంగా మూడు కోట్ల పారితోషికం ను తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.అందుకు కారణం సమంత లేడీ ఓరియంటెడ్‌ సినిమా అవ్వడంతో పాటు.ఆమె ప్రమోషన్ కార్యక్రమాలకు ఎక్కువగా హాజరు అయ్యేందుకు ఓకే చెప్పిందట.అందుకే ఆరోగ్యం బాగా లేకున్నా కూడా ఆమె ప్రమోషన్ కార్యక్రమాల కోసం సమయం ను కేటాయించిందట.సమంత ను తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రమోషన్‌ చేయించాలని గుణ శేఖర్ టీమ్‌ భావిస్తుంది.

Telugu Allu Arha, Dil Raju, Gunasekhar, Gunashekhar, Samantha, Shakuntalam, Toll

పాన్ ఇండియా స్థాయిలో శాకుంతలం సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తే కచ్చితంగా మంచి బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉంది.పాన్ ఇండియా రేంజ్‌ లో రిలీజ్ చేయడం మాత్రమే కాకుండా భారీ ఎత్తున ప్రమోషన్‌ చేస్తే బాగుంటుంది అనేది ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం.సమంత భారీ పారితోషికం తీసుకుంది కనుక ఆమె తో సాధ్యం అయినంత ఎక్కువ ప్రమోషన్‌ చేయించే అవకాశాలు ఉన్నాయి అంటూ మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.సమంత ప్రమోషన్స్ తో సినిమాకు బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube