పుష్ప సినిమా పేరు చెబితే చాలు వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు ఫ్యాన్స్ ఉన్నారు.తగ్గేదేలే అనే ఒకే డైలాగ్ తో అల్లు అర్జున్ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసాడు.
మరి ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉన్న విషయం తెలిసిందే.ఇప్పుడు పుష్ప 2 సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బన్నీ ఫ్యాన్స్ తెగ ఎదురు చూస్తున్నారు.
అయితే వీరు గత ఏడాదిగా ఎదురు చూస్తున్న కానీ ఇప్పటికీ ఈ సినిమా పూర్తి కాలేదు.
కానీ ఎట్టకేలకు వీరి ఎదురు చూపులకు ఫలితం వచ్చేసింది.
కొద్దీ రోజుల క్రితం ఈ సినిమా షూట్ వైజాగ్ లో గ్రాండ్ గా స్టార్ట్ అయ్యింది.ఇక్కడ దాదాపు రెండు వారాల పాటు ఈ సినిమా షూట్ జరగనుంది.
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 1 ఘన విజయం సాధించింది.

400 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు భారీ లాభాలను అందించిన ఈ సినిమాను ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ మరింత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.మరి సుకుమార్ కూడా అన్నివిధాలా స్క్రిప్ట్ ను మార్పులు చేర్పులు చేసారు.కాగా ఇప్పుడు ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి నెట్టింట వైరల్ అయ్యింది.
ఈ సినిమా ఇంటర్వెల్ లో అల్లు అర్జున్ డాన్ లుక్ లో కనిపిస్తాడని.రష్మిక పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూలో థ్రిల్లింగ్ ఎలిమెంట్ గా ఈ ట్విస్ట్ నిలుస్తుందని ఎవ్వరూ ఊహించని విధంగా ఈ ట్విస్ట్ ఉంటుంది అని అంటున్నారు.

ఇక ఈ సీక్వెల్ లో కొత్త పాత్రలను కూడా సుకుమార్ రంగంలోకి దించబోతున్నాడు.పార్ట్ 1 కంటే మరింత గ్రాండ్ గా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మరి పార్ట్ 2 తో ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తారో వేచి చూడాల్సిందే.







