హైదరాబాద్ నగరంలో రోడ్డు మరోసారి కుంగిపోయింది.హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్.5 లో రోడ్డు కుంగినట్లు తెలుస్తోంది.
అయితే ఒక్కసారిగా రోడ్డు కుంగిపోవడంతో మట్టి లోడ్ టిప్పర్ గుంతలో ఇరుక్కుపోయింది.
ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ తో పాటు వాహనంలో ఉన్న ఇద్దరు కార్మికులకు స్వల్ప గాయాలు అయినట్లు తెలుస్తోంది.కాగా కుంగిన రోడ్డు పక్కనే నాలా ప్రవాహిస్తోంది.
సమాచారం అందుకున్న స్థానిక కార్పొరేటర్ టిప్పర్ ను తొలగించేందుకు చర్యలు చేపట్టారు.గోషామహల్ చక్నావాడి ఘటన మరువక ముందే మరో ఘటన చోటు చేసుకోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.