రాజమౌళి ఇప్పటివరకు ఆ హీరోలతో సినిమా చేయకపోవడానికి కారణం ఏంటో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పిన ఘనత జక్కన్నకు మాత్రమే ఉందని చెప్పాలి.

 Do You Know The Reason Why Rajamouli Has Not Done A Film With Those Heroes So Fa-TeluguStop.com

అయితే ఈయన ఇప్పటివరకు ఇండస్ట్రీలో తీసిన ఏ ఒక్క సినిమా కూడా అపజయం కాలేదు.ఇలా అపజయం ఎరుగని దర్శకుడిగా రాజమౌళి పేరు సంపాదించుకున్నారు.

ఇక ఈయన ఇండస్ట్రీలో ఎక్కువగా రాంచరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి హీరోలతో సినిమాలు చేశారు.అలాగే రవితేజ సునీల్ నాని వంటి హీరోలతో కూడా సినిమాలు చేశారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ముగ్గురు మెగా హీరోలతో ఇప్పటివరకు రాజమౌళి సినిమాలు చేయలేదు.మెగా కాంపౌండ్ నుంచి హీరోలుగా వచ్చి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న చిరంజీవి పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ తో రాజమౌళి ఇప్పటివరకు సినిమాలు చేయకపోవడం గమనార్హం.

Telugu Allu Arjun, Allu Arvind, Chiranjeevi, Chiru, Pawan Kalyan, Prabhas, Rajam

అయితే రాజమౌళి ఈ ముగ్గురితో ఎందుకు సినిమాలు చేయలేదనే విషయానికి వస్తే… చిరంజీవి వయసు పైపడటంతో ఈయన చిరంజీవితో రిస్కీ షాట్స్ తీసే అంత సాహసం చేయలేరు.అంతేకాకుండా స్టార్ హీరోలతో ఈయన కంఫర్ట్ గా పనిచేయలేరన్న ఉద్దేశంతో చిరంజీవితో ఇప్పటివరకు సినిమా చేయలేదని తెలుస్తుంది.

Telugu Allu Arjun, Allu Arvind, Chiranjeevi, Chiru, Pawan Kalyan, Prabhas, Rajam

ఇక పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్నారు.రాజమౌళి సినిమా అంటే మినిమం రెండు మూడు సంవత్సరాలు ఆయన ఆధీనంలో ఉండాలి.అలా ఉండడం పవన్ కళ్యాణ్ కుదరదు కనుక ఈయనతో సినిమా చేసే అవకాశం ఏమాత్రం లేదు.ఇక అల్లు అర్జున్ తో కూడా ఇప్పటివరకు సినిమా చేయలేదు అయితే అల్లు అర్జున్ తో సినిమా చేయకపోవడానికి గల కారణం అల్లు అరవింద్ తో రాజమౌళికి ఉన్న వ్యక్తిగత విభేదాలే కారణమని తెలుస్తుంది.

అందుకే ఈయన ఇప్పటివరకు అల్లు అర్జున్ తో సినిమా చేయలేదని సమాచారం.అయితే అల్లు అర్జున్ తో రాజమౌళి సినిమా చేయకపోవడానికి ఇదే ప్రధాన కారణమా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube