తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు దగ్గరికి వస్తున్న కొద్ది.పార్టీలు విమర్శలకు, వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించు కుంటు వస్తున్నాయి.ఇక విమర్శలు వేడి పెరగడం తో.ఇప్పుడు ప్రాక్టికల్ వర్క్ మొదలు పెట్టారు.జన సేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహినీ తీసుకొని బస్ యాత్ర మొదలు పెట్టారు.
తెలంగాణ లోని కొండగట్టు అంజన్న సన్నిధి నుంచి యాత్ర మొదలు పెట్టారు.రాష్ట్రం లో అధికారం లో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత సీఎం జగన్ మోహన్ రెడ్డి పథకాల పంట పారిస్తు ఉన్నారు.
ఇప్పుడు రేసులో వెనక పడింది టీడీపీ నే.దాంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.తన కుమారుడిని పాద యాత్రకు సిద్దం చేసారు.ఈ యాత్ర తో లోకేష్ పై ఉన్న అపవాదులు అన్ని తొలగి పోతాయని.టీడీపీ నేతలు భావిస్తూ ఉన్నారు.లోకేష్ అసమర్థుడు అనే ముద్రను కూడా ఈ పాదయాత్ర చెరిపి వేస్తుందని లెక్కలు వేసుకుంటూ ఉన్నారు.

చంద్రబాబు మాత్రం లోకేష్ యాత్ర పై భయపడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.లోకేష్ కు తెలుగులో పంచులు వేయడం, మాస్ డైలాగ్ లు మాట్లాడటం, కౌంటర్లు, సేటైర్లు వేయడం రాదు.అప్పుడప్పుడు ప్రయతించినా అవి తిరిగి స్వంత పార్టీ కే నష్టం చేశాయి.తెలుగు ఆయన తడబడుతూ మాట్లాడిన ప్రతి సారి అవతలి పార్టీలు దాన్ని క్యాష్ చేసుకున్నాయి.
దాంతో ఈ సారి చేపడుతున్న పాద యాత్రలో లోకేష్ ఇలాంటి తప్పుల్ని.మళ్లీ రిపీట్ చేస్తే.అది పార్టీ పై కోలుకోలేని దెబ్బ పడుతుంది.

రాజకీయాల గురించి, పొత్తుల గురించి, ఇతర సమస్యలు గురించి మాట్లాడే సమయం లో లోకేష్ నోరు జారితే అది పెను విధ్వంసాన్ని తెస్తుంది.అందుకే అలాంటి పొరపాటు జరగకుండా.అయన చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టూ తెలుస్తోంది.
బాబు అనుకున్నా లైన్ లో కాకుండా.లోకేష్ గట్టు దాటితే ఎలా ఉంటుంది అనే భయం గట్టిగా పట్టుకున్నట్టు తెలుస్తోంది.
ఒకవేళ లోకేష్ యాత్రలో ఇలాంటి తప్పుడు దొర్లితే మాత్రం.టీడీపీ కి వచ్చే ఎన్నికలు చాలా కష్టం.
మరి చంద్ర బాబు ఆశలను లోకేష్ నేర వెరుస్తరా.? లేక యాత్రలో చతికిల పడతారా చూడాలి.







