తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ ఒకప్పటి హీరోయిన్ ఆసిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగులో పలు సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది ఆసిన్.
కాగా ఆసిన్ మొదట రవితేజ నటించిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత వరుసగా తెలుగులో అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.
తెలుగులో గజిని, శివమణి, ఘర్షణ,లక్ష్మి, చక్రం వంటి సినిమాలలో నటించిన మెప్పించింది.
అతి తక్కువ సమయంలోనే వరుసగా సినిమా అవకాశాలు అందుకోవడంతోపాటు తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువ అయింది.
అలాగే కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ హిందీ భాషల్లో కూడా నటించి భారీగా క్రేజ్ ని ఏర్పరచుకుంది.కెరిర్ బాగా పీక్స్ లో ఉన్న సమయంలో ఈమె మైక్రోమ్యాక్స్ అధినేత రాహుల్ శర్మను 2016లో పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బాయ్ చెప్పేసింది.కాగా వీరికి ఆరిన్ అనే పాప కూడా ఉంది.అయితే ఆసిన్ సినిమాలకు దూరంగా ఉంటున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటుంది.

తన భర్తకు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.అయితే ఈ మధ్యకాలంలో ఆసిన్ సోషల్ మీడియాలో అంతగా కనిపించడం లేదు.గత ఏడాది అక్టోబర్ 24న తన పాప ఆరిన్ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే విషెస్ చెబుతూ పోస్ట్ చేసింది.
ఆ తర్వాత ఎలాంటి పోస్ట్ చేయలేదు.కాగా ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన ఆసిన్ ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తోంది.ఈ నేపథ్యంలోనే ఆమెకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.







