స్కూటర్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తక్కువ ప్రైస్‌తో కొత్త యాక్టివా H-స్మార్ట్‌ లాంచ్…

హోండా మోటార్‌సైకిల్ స్కూటర్స్ ఇండియా (HMSI) భారతదేశంలోని స్కూటర్ ప్రియులకు తీపి కబురందించింది.

యాక్టివా 6G కొత్త టాప్-ఎండ్ వేరియంట్ అయిన H-స్మార్ట్‌ని తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది.

దాంతో ఇప్పుడు యాక్టివా 6G స్టాండర్డ్, డీలక్స్, H-స్మార్ట్‌ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.ఈ మూడు స్కూటర్ల ప్రైస్ చూసుకుంటే, స్టాండర్డ్ వేరియంట్ రూ.74,536, డీలక్స్ వేరియంట్ రూ.77,036, H-స్మార్ట్‌ వేరియంట్ రూ.80,537గా ఉన్నాయి.కొత్త H-Smart ఐదు కొత్త పేటెంట్ టెక్నాలజీ అప్లికేషన్‌లతో అందుబాటులోకి వచ్చింది.

యాక్టివా 6G H-స్మార్ట్‌ స్కూటర్‌ను స్మార్ట్ కీతో స్టార్ట్ చేసుకొని రైడ్ చేయవచ్చు.ఇందులో స్మార్ట్ ఫైండ్ ఫీచర్ అందించారు.దీని సహాయంతో రైడర్ తన వద్ద ఉన్న కీని ఉపయోగించి తన స్కూటర్‌ ఎక్కడుందో ఈజీగా కనిపెట్టొచ్చు.

స్మార్ట్ కీ రెండు మీటర్ల దూరంలో ఉన్నట్లయితే స్కూటర్ హ్యాండిల్‌ను లాక్ చేయడానికి లేదా అన్‌లాక్ చేయడానికి రైడర్‌ని అనుమతిస్తుంది.అలానే ఇందులో ఉన్న స్మార్ట్ సేఫ్ ఫీచర్ కూడా ఉంది.

Advertisement

స్మార్ట్ సేఫ్ అనేది స్కూటర్‌ను స్టార్ట్ చేయడానికి ఓనర్‌ని తప్ప ఎవరినీ అనుమతించదు.స్మార్ట్ సేఫ్ మ్యాప్ చేయబడిన స్మార్ట్ ECUని ఉపయోగించి వాహన దొంగతనాన్ని నిరోధిస్తుంది.

కొత్త హోండా యాక్టివా 6G హెచ్-స్మార్ట్ మొదటి సారిగా అల్లాయ్ వీల్స్‌ను పొందింది.ఇది ముందు టెలిస్కోపిక్ సస్పెన్షన్, అడ్జస్టబుల్ రియర్ సస్పెన్షన్‌తో వస్తుంది.హోండా యాక్టివా హెచ్-స్మార్ట్ పవర్ అవుట్‌పుట్ 8,000 ఆర్‌పీఎమ్ వద్ద 7.73 బిహెచ్‌పి, ఇది ఇతర వేరియంట్‌ల అవుట్‌పుట్ కంటే ఎక్కువ.ఈ బైక్ 8.79 Nm గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేసే 110 cc, PGM-FI ఇంజన్‌తో వస్తుంది.ఈ ఇంజన్‌లో మార్క్యూ ఎన్‌హాన్స్‌డ్ స్మార్ట్ పవర్ (eSP) టెక్నాలజీ కూడా ఉంది.

ఇది లీనియర్ పవర్‌ను అందిస్తుంది.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?
Advertisement

తాజా వార్తలు