తెలుగు ప్రేక్షకులకు టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ మధ్యకాలంలో నిర్మాత దిల్ రాజు సినిమాల విషయాల కంటే కాంట్రవర్సీలు, ట్రోలింగ్స్ విషయంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవలె వారిసు సినిమా విషయంలో వార్తల్లో నిలిచిన దిల్ రాజు, ఇటీవలె వారిసు ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో తమిళంలో మాట్లాడి మరోసారి సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే.ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా స్టేజ్ పైన దిల్ రాజు తమిళంలో మాట్లాడుతూ తమిళ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

డాన్స్ వేనుమ డాన్స్ ఇరుక్కు (మీకు డాన్స్ కావాలంటే డాన్స్ ఉంది), ఫైట్ వేనుమ ఫైట్ ఇరుక్కు ( ఫైట్స్ కావాలంటే ఫైట్స్ ఉన్నాయి) అంటూ ఏదో వచ్చి రాని తమిళ భాషలో మాట్లాడి ట్రోల్స్ ని ఎదుర్కొన్నాడు దిల్ రాజు.ఈ క్రమంలోని నెటిజన్స్ ఎవరికి తోచిన విధంగా వారు ట్రోల్స్ చేస్తూ దిల్ రాజు మాట్లాడిన మాటలను ట్రోలింగ్స్ చేస్తున్నారు.తాజాగా కూడా మరొక నిర్మాత కూడా స్టేజ్ పై నిర్మాత దిల్ రాజుని ఇమిటేట్ చేస్తూ తమిళంలో మాట్లాడడంతో అది కాస్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.నిర్మాత ఎస్కేఎన్ రైటర్ పద్మభూషణ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరయ్యారు.

ఈ నేపథ్యంలోనే స్పీచ్ చివర్లో మాట్లాడుతూ ఈ సినిమాలో కామెడీ ఇరిక్కు, పైట్స్ ఇరిక్కు, డాన్స్ ఇరిక్కు అంటూ దిల్ రాజును ఇమిటేట్ చేయడంతో స్టేజ్ పై ఉన్న చిత్రబృందం కూడా ఫుల్ గా నవ్వుకున్నారు.అక్కడున్న ప్రేక్షకులతో పాటు వేదికపై ఉన్న వారు కూడా వాళ్ళ నవ్వుని కంట్రోల్ చేసుకోలేకపోయారు.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఆ వీడియోని చూసిన నెటిజన్స్ ఫుల్ కామెడీగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.







