బీహార్ రాజధాని పాట్నాలో ఒక వింత ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఈ ప్రదేశంలోని ఏటీఎంలోకి ఒక అర్ధరాత్రి వేళ గాఢంగా ప్రేమించుకుంటున్న ఇద్దరూ వెళ్లి సరసాలు ఆడుకున్నారు.
ఆ సమయంలో వారు ఏటీఎం లాక్ చేసేసారు.ఏటీఎం అన్న తర్వాత ఎవరూ ఒకరు వచ్చి వెళుతుంటారు కాబట్టి వీరిద్దరిని కొందరు గమనించారు.
వారి ఏటీఎం లోపలికి వెళ్లడం అది లాక్ కావడం వల్ల వీరి దొంగతనం చేస్తున్నారేమో అని వారు అనుమానపడ్డారు.
ఆ అనుమానంతోనే వారు కంకర్‌బాగ్‌లో ఉన్న ఏటీఎంను దొంగలు హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని పాట్నా పోలీసులకు సమాచారం అందించారు.
దాంతో పాట్నా పోలీసులు బృందం హుటాహుటిన కలిసి ఘటనాస్థలికి చేరుకున్నారు.తుపాకీలతో సహా అక్కడికి విచ్చేసిన పోలీసులు దోపిడీ దొంగలను పట్టుకునేందుకు ఏటీఎంలోకి తొంగి చూశారు.అప్పుడు వారికి ఏటీఎంలో ఎవరూ కనిపించలేదు.

లోపలికి వెళ్లి చూడగా ఏటీఎంలోని డబ్బును ఎవరూ తీయలేదని, అది హ్యాకింగ్‌కు గురి కాలేదని తెలిసింది.చివరికి వారికి ఏటీఎంలో ఇద్దరూ ప్రేమ పక్షులు రొమాన్స్ చేస్తూ కనిపించారు.పోలీసులను చూసి భయపడ్డ ఆ జంట క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత పాట్నా పోలీసులు ఆ జంటను దొంగలు కాదని తెలుసుకొని విడిచిపెట్టారు.

అదే సమయంలో కంట్రోల్ రూంకు కూడా సమాచారం అందించారు.కాగా ఈ ఘటన ఇప్పుడు స్థానికులతో పాటు భారతదేశ వ్యాప్తంగా చాలా మందిని నవ్విస్తోంది.కాగా ఈ రోజుల్లో ఏటీఎం దొంగతనాలు బాగా పెరిగిపోతున్నాయి.
ఈ నేపథ్యంలో పోలీసులు వీటిని ఆపేందుకు కొంచెం అనుమానం వచ్చినా వెంటనే రంగంలోకి దిగుతున్నారు.







