స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

సినిమా డైరెక్టర్లు ఎంత కష్టపడి సినిమాలు తీసినా ఏదో ఒక సందర్భంలో వేర్వేరు కారణాల వల్ల సినిమాలు ఫ్లాప్ అవుతాయి.ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం దర్శకులకు సులువు కాదనే సంగతి తెలిసిందే.

 Star Director Rajamouli Assets Value Details Here Goes Viral , Rajamouli, Rajam-TeluguStop.com

అయితే రాజమౌళి మాత్రం ఎలా మ్యాజిక్ చేస్తారో తెలీదు కానీ ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలు అంటే రికార్డులు క్రియేట్ అవుతాయి.కొన్నిసార్లు ఆయన సినిమాలకు నెగిటివ్ టాక్ వచ్చినా రికార్డు స్థాయిలో కలెక్షన్లు వస్తాయి.

అటు మాస్ ప్రేక్షకులను ఇటు క్లాస్ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా రాజమౌళి పేరు సంపాదించుకున్నారు.రాజమౌళి రెమ్యునరేషన్ ప్రస్తుతం భారీ రేంజ్ లో ఉన్నా ఆ రెమ్యునరేషన్ లో ఎక్కువ మొత్తాన్ని జక్కన్న సినిమాలకు ఉపయోగపడే వస్తువుల కోసం ఖర్చు చేస్తారని సమాచారం.

కొత్త టెక్నాలజీల గురించి తెలుసుకోవడానికి రాజమౌళి తెగ ఆసక్తి చూపిస్తారని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

Telugu Mahesh Babu, Rajamouli, Ram Chran, Tollywood-Movie

అయితే రాజమౌళి సినిమాల ద్వారా సంపాదించిన ఆస్తుల విలువ 158 కోట్ల రూపాయలు కావడం గమనార్హం.తను సంపాదించిన డబ్బులో జక్కన్న ఎక్కువ మొత్తాన్ని భూములపై ఇన్వెస్ట్ చేస్తారు.రాజమౌళి రేంజ్ మరింత పెరగాలని అభిమానులు భావిస్తుండటం గమనార్హం.

రాజమౌళి మహేష్ సినిమాకు 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం.

Telugu Mahesh Babu, Rajamouli, Ram Chran, Tollywood-Movie

మహేష్ సినిమా తర్వాత రాజమౌళి బాహుబలి3 లేదా ఆర్.ఆర్.ఆర్2 తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.రాజమౌళి స్థాయి అంతకంతకూ పెరుగుతుండగా జక్కన్న మాత్రం ఆ గర్వాన్ని ఎక్కడా ప్రదర్శించడం లేదు.కొన్ని విషయాలలో జక్కన్నకు జక్కన్నే సాటి అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

రాజమౌళి కెరీర్ పరంగా మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుని తెలుగు సినిమాల స్థాయిని ఊహించని రేంజ్ లో పెంచాలని అభిమానులు భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube