శృతి హాసన్ అలాంటి సమస్యలతో బాధ పడుతున్నారా.. నిజమేంటంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన శృతి హాసన్ మానసిక సమస్యలతో బాధ పడుతున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.శృతి హాసన్ సినిమాల ప్రమోషన్స్ కు కూడా హాజరు కాకపోవడంతో వైరల్ అయిన వార్తలను చాలామంది నిజమేనని నమ్మారు.

 Heroine Sruthi Hassan Health Issues Details Here Goes Viral In Social Media ,her-TeluguStop.com

అయితే ఈ వార్తలు తన దృష్టికి రావడంతో శృతి హాసన్ ఈ వార్తల గురించి స్పందించి ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

వైరల్ అవుతున్న కథనాలలో ఏ మాత్రం నిజం లేదని తన గురించి అలాంటి తప్పుడు కథానాలను ప్రచారం చేయవద్దని శృతి హాసన్ అన్నారు.

వైరల్ అయిన సమాచారం తప్పుడు సమాచారం అని ఆ సమాచారాన్ని నమ్మవద్దని ఆమె కోరారు.ఇలాంటి విషయాలకు నాటకీయత కలిపి రాయడం వల్ల ఫ్యాన్స్ టెన్షన్ కు లోనవుతున్నారని శృతి హాసన్ చెప్పుకొచ్చారు.

మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడాలంటే భయం వేస్తుందని ఆమె తెలిపారు.

నా విషయంలో అలా ప్రచారం చేయడం వర్కౌట్ కాలేదని శృతి హాసన్ పేర్కొన్నారు.నేను మానసిక ఆరోగ్యానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని శృతి హాసన్ కామెంట్లు చేశారు.నాకు వైరల్ ఫీవర్ వచ్చిందని ఆ సమస్య నుంచి కోలుకుంటున్నానని తెలిపారు.

ఇలాంటి వార్తలు ప్రచారం చేసేవాళ్లకు మానసిక సమస్యలు ఉన్నాయని అనుకుంటున్నానని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.

శృతి హాసన్ వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో రెండు హిట్లను ఖాతాలో వేసుకున్నారు.వీరసింహారెడ్డితో పోల్చి చూస్తే వాల్తేరు వీరయ్య మూవీలో ఆమెకు బెటర్ రోల్ దక్కింది.శృతి హాసన్ వరుసగా టాలీవుడ్ సినిమాలతో బిజీ అవుతూ సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తుండటం గమనార్హం.

కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా శృతి హాసన్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube