ఏపీలోని దేవాలయాలను ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.తిరుమలలో వసతి గదుల రేట్లు పెంచితే భక్తులు ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు.
భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వైసీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.ఈ క్రమంలో టీటీడీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.