టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ తాజాగా నటించిన చిత్రం వీర సింహారెడ్డి.ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.
ఇందులో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ బాలయ్య బాబు సరసన నటించింది.కాగా తాజాగా ఈ సినిమా నేడు అనగా జనవరి 12న విడుదల అయిన విషయం మనందరికీ తెలిసిందే.
అఖండ సినిమా తరువాత అంతకు రెండింతలు అంచనాలతో వీర సింహారెడ్డి భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి మంచి హిట్ టాక్ను సొంతం చేసుకుంది.ఇకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బాలయ్య బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.
తనకు చుట్ట తాగే అలవాటు ఉందని, ప్రతిరోజు ఉదయం లేచిన వెంటనే చుట్ట తాగుతానని తెలిపిన విషయం తెలిసిందే.వీరసింహారెడ్డి సినిమాలో చుట్ట తాగడం స్టైల్ కూడా అందర్నీ ఆకర్షిస్తుంది అని బాలయ్య బాబు తెలిపారు.
అలాగే సినిమాలో బాలకృష్ణ గెటప్ కోసం చాలా మార్పులు చేయాల్సి వచ్చిందని గోపీచంద్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే చుట్ట కూడా పెట్టమన్నారని, చుట్ట తాగడం వల్ల గొంతు క్లీన్ గా మారి ఊపిరితిత్తుల్లో ఉండే స్లేష్మం పోయి గొంతు గంభీరంగా వస్తుందని, డైలాగ్ చెబుతున్నప్పుడు ఇబ్బందులకు కూరి కాకుండా ఉండటం కోసం చుట్టూ తాగుతూ ఉంటాను అనే బాలకృష్ణ తెలిపారు.ఆ సమయంలో చుట్టను సిగరెట్ల లోపలికి పీల్చుకోకుండా నోటిలోకి మాత్రమే పీల్చుకుంటానని సిగరెట్ కంటే చుట్ట మంచిది అని తెలిపాడు బాలయ్య.
ఇకపోతే బాలయ్య బాబు సినిమాలోని పాటలు ప్రస్తుతం యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్న విషయం తెలిసిందే.అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.మరి ముఖ్యంగా మా బావ మనోభావాలు, జై బాలయ్య అనే పాటలు అయితే యూట్యూబ్లో రికార్డు స్థాయిలో వ్యూస్ ని రాబడుతున్నాయి.
తాజాగా ఈ సినిమా విడుదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి మంచి హిట్టు టాక్ ను సొంతం చేసుకుంది.ప్రస్తుతం థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.ఏ థియేటర్ వద్ద చూసినా కూడా బాలయ్య బాబు అభిమానులు జై బాలయ్య అన్న నినాదంతో హోరెత్తిస్తున్నారు.