కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత మల్లు రవి విచారణకు హాజరు కావాలని 41 సీఆర్పీసీ నోటీసులు అందించారు.
ఇప్పటికే మల్లు రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.కాగా మల్లు రవి విచారణకు హాజరయ్యే విషయంపై సస్పెన్స్ కొనసాగుతోంది.
ఇప్పటికే ఈ కేసు వ్యవహారంలో తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల వ్యూహాకర్త సునీల్ కనుగోలును పోలీసులు విచారించారు.







