తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కమెడియన్ పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.
ఇకపోతే పంచ్ ప్రసాద్ గురించి ఆయన హెల్త్ కండిషన్ గురించి మనందరికీ తెలిసిందే.కాగా పంచ్ ప్రసాద్ కు రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఒకటి అతని భార్య ఇచ్చి అతన్ని కాపాడుకుంది.
అయితే మొన్నటి వరకు కూడా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, జాతి రత్నాలు లాంటి కామెడీ షోలలో కామెడీ చేసిన ప్రసాద్ పరిస్థితి ప్రస్తుతం దేనియంగా మారింది.
కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ప్రసాద్ కనీసం ఇంటి అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నాడు.
ఇప్పటికే చికిత్స కోసం తన దగ్గరున్న డబ్బంతా ఖర్చు పెట్టగా చివరికి అప్పులు కూడా చేయాల్సి వచ్చింది.కానీ ఇప్పటికీ అతడి ఆరోగ్యం కుదుటపడలేదు. పంచ్ ప్రసాద్ దీనస్థితి తెలిసి అతడిని ఆదుకోవడానికి ఇప్పటికీ ఎంతోమంది ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అలాగే జబర్దస్త్ ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.అయితే తాజాగా మరొక జబర్దస్త్ కమెడియన్ ప్రసాద్ ని ఆదుకోవడం కోసం హెల్ప్ చేయడానికి ముందు వచ్చాడు.
అతను మరెవరో కాదు కమెడియన్ కిర్రాక్ ఆర్పీ.

కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ నుంచి పూర్తిగా కోలుకునేవరకు అవసరమైన మొత్తం డబ్బును తాను అందిస్తానన్నాడు ఆర్పీ.ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆర్పీ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.పంచ్ ప్రసాద్ దగ్గర రూపాయి లేదు.
అద్దె కట్టడానికి కూడా డబ్బుల్లేవు.అతడి ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తోంది.
తనకు ఎలాంటి ఆస్తిపాస్తులు కూడా లేవు.వాడు చాలా మంచివాడు, నాకు కావాల్సిన వాడు.
తనను నేను ఆదుకుంటాను.వచ్చే నెల మణికొండలో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా.
ఆ వచ్చిన దాంట్లో అతడికి అవసరమయ్యే దానికంటే పదివేలు ఎక్కువే ఇస్తాను.కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్‌కు 15 లక్షలైనా సరే చెల్లించి కాపాడుకుంటాను.

ప్రసాద్ పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యేవరకు ఆర్థికంగా అండగా నిలబడతాను అని చెప్పుకొచ్చాడు కిర్రాక్ ఆర్పీ.అయితే ప్రస్తుతం కిరాక్ ఆర్పి ఆ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు పెట్టి కూడా చాలా రోజులైన విషయం తెలిసిందే.ఇటీవల క్రౌడ్ ఎక్కువగా ఉందని షాప్ క్లోజ్ చేసిన ఆర్పీ మల్లీ రీ ఓపెన్ చేసాడు.అయితే ఈ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాపు పెట్టకు ముందు కిరాక్ ఆర్పి ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలను మరొకసారి గుర్తు చేస్తూ అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఈ వార్త విన్న పలువురు నెటిజన్స్ కిరాక్ ఆర్పి మంచి మనసుకి హాట్సాఫ్ చెబుతూ ఆర్పి పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.