టాలీవుడ్ డైరెక్టర్ బాబీ, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13న విడుదల కానున్న విషయం తెలిసిందే.ఇప్పటికీ ఈ సినిమాపై భారీగా అంచనాలను నెలకొన్నాయి.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.విడుదల చేతికి కేవలం మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా మూవీ మేకర్స్ గ్రాండ్ గా ప్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించారు.ఒకవైపు చిరంజీవి ప్రమోషన్స్ లో పాల్గొంటూనే మరొకవైపు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతున్నాడు.
ఈ క్రమంలోని తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి మాట్లాడిన మాటలు పరోక్షంగా బాలయ్య గురించి చెప్పినట్లు ఉన్నాయి.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.రామ్ చరణ్ ప్రతిసారి ప్రతి చోట నా ప్రస్తావన తేవాల్సిన అవసరం లేదు.మా నాన్న చిరంజీవి, ఆయన చాలా గొప్పోడు అంటూ ప్రతిసారి చెబితే జనాలకు విసుగొచ్చేస్తుంది.
హే ఆపవయ్యా నీ సుత్తి అని చరణ్ ని తిడతారు అంటూ చిరంజీవి కామెంట్స్ చేశారు.చిరంజీవి మాట్లాడిన మాట తీరును బట్టి చూస్తుంటే బాలయ్య బాబు నీ ఉద్దేశించి అన్నట్లు కనిపిస్తోంది.
ఎందుకంటే ఆ రోజుల్లో మా నాన్నగారూ.అనేది బాలయ్య బాబు ఊతపదం.
అలా ఎవరైనా అంటే వెంటనే బాలయ్య గుర్తొస్తారు.ఇక బాలయ్య ప్రతి వేదిక పై తన తండ్రి గురించి ప్రస్తావన తెస్తూ ఉంటాడు.
మాకంటే ఎవరూ గొప్ప కాదంటారు.ఈ వ్యాఖ్యలను విమర్శిస్తూ చిరంజీవి లేటెస్ట్ కామెంట్స్ చేశారని అనిపించింది అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బాలయ్య బాబు అభిమానులు.

ఇటీవలే ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిరంజీవి బాలయ్య బాబును టార్గెట్ చేస్తూ శృతిహాసన్ ఈవెంట్ కీ రాకపోవడంతో ఒంగోలులో ఏం జరిగిందో తెలియదు.సడన్ గా శృతి ఆరోగ్యం బాగోలేదంట.బహుశా ఆమెను ఎవరైనా బెదిరించారేమో అని నవ్వుతూ సెటైర్స్ వేశారు.అసలు వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరుకాకుండా

శృతి హాసన్ ని బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది.వీరసింహారెడ్డి చిత్రానికి పోటీగా విడుదలవుతున్న వాల్తేరు వీరయ్య చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కి రాకుండా శృతిని బాలయ్య బెదిరించాడన్నట్లు ఆయన ఆరోపణలు చేశారు మెగాస్టార్.







