యూపీఐకి పెరుగుతున్న పాపులారిటీ.. ఇకపై మరో 10 దేశాల్లోనూ సేవలు!

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిచయం చేసిన యూపీఐ మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ అందుబాటులోకి వస్తోంది.ఇటీవల ఎన్‌పీసీఐ జారీ చేసిన సర్క్యులర్ పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టం అవుతుంది.

 Indians In These 10 Countries Can Soon Make Upi Payments Details, Payment System-TeluguStop.com

ఈ సర్క్యులర్‌లో యూపీఐ రిలేటెడ్ దేశీయ కోడ్లతో పాటు 10 దేశాల మొబైల్ నంబర్ల నుంచి ఎన్నారైలు ట్రాన్సాక్షన్లు జరుపుకోవచ్చని ఎన్‌పీసీఐ పేర్కొంది.ఆ పది దేశాల పేర్లను కూడా స్పష్టంగా రాసింది.

అవేంటంటే, యూఎస్ఏ, సౌదీ అరేబియా, యూఏఈ, సింగపూర్, ఆస్ట్రేలియా, కెనడా, హాంకాంగ్, ఒమన్, ఖతార్, యూకే.ఈ దేశాల నుంచి నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI) త్వరలో యూపీఐ ట్రాన్సాక్షన్లు చేయవచ్చు.

ఎన్‌పీసీఐ సర్క్యులర్ ప్రకారం, యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI)ని వాడే నాన్-రెసిడెంట్ ఇండియన్స్ (NRI) త్వరలో తమ NRE (నాన్-రెసిడెంట్ ఎక్స్టర్నల్) అకౌంట్స్, ఇంటర్నేషనల్ నంబర్ల మధ్య కూడా క్యాష్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

ఇంటర్నేషనల్ మొబైల్ నంబర్ల నుంచి డబ్బులు బదిలీ చేయడం అనేది ఎప్పుడూ ఒక సీరియస్ విషయంగానే పరిగణించడం జరుగుతుంది.ఆ విషయంలో కూడా భారత ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ నాన్-రెసిడెంట్ అకౌంట్స్ యూపీఐలో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ (FEMA) నిబంధనలు, యాంటీ మనీ లాండరింగ్ (AML), CFT (ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం చేయడం) నిబంధనలను ఈ బదిలీలపై పెట్టింది.

ఇకపోతే గత సంవత్సరంలో యూపీఐ నెట్‌వర్క్ ట్రాన్సాక్షన్లు 90 శాతం పెరిగాయి.సెండ్ చేసిన క్యాష్ విషయంలోనూ 76 శాతం వృద్ధి నమోదయింది.ఇక కొత్త తీసుకొస్తున్న సేవలు ద్వారా పేర్కొన్న 10 విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు యూపీఐ సేవలను ఉపయోగించుకోగలుగుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube