మెగా వారసు రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని గుడ్ న్యూస్ చెప్పడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.ఈ ఏడాది మెగా కుటుంబంలోకి బుల్లి వారసుడు రాబోతున్నారన్న వార్త అందరిని ఎంతో సంతోషానికి గురిచేసింది.
ఇకపోతే ఒకవైపు రామ్ చరణ్ తండ్రి కాబోతున్నారన్న గుడ్ న్యూస్ అలాగే మరోవైపు ఈయన నటించిన RRRసినిమాలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ రావడం అభిమానులను మరింత సంతోషానికి గురి చేసింది.
ఈ క్రమంలోనే చిత్ర బృందం మొత్తం గోల్డెన్ గ్లోబ్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఇక ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరూ కూడా వారి భార్యలతో హాజరవడంతో అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.ఇక ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఉపాసన తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
ఈమె సోషల్ మీడియా వేదికగా తన బిడ్డ గురించి కూడా ఆసక్తికరమైన పోస్ట్ చేశారు.

RRR కుటుంబంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందని పోస్ట్ చేశారు.మన సినిమాకు సగర్వంగా ప్రాతినిధ్యం వహించినందుకు చాలా గర్వంగా ఉంది.ఈ సినిమా విషయంలో నాతోపాటు నా బిడ్డ కూడా ఈ గౌరవం పొందడం చాలా సంతోషంగా ఉందని ఉపాసన తెలిపారు.

ఉక్రెయిని షెడ్యూల్ టైం లో మేకర్స్ ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇది గెలుపు ఈ ప్రయాణంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మిస్టర్ సి రాజమౌళి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇలా ఉపాసన తన బిడ్డ గురించి, సినిమా గురించి చేసినటువంటి ఈ పోస్టు చూసిన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.







