తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు.తొలుత మహబూబాబాద్ జిల్లాకు వెళ్లనున్న ఆయన నూతన కలెక్టరేట్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు.
అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు ఆయన చేరుకోనున్నారు.పర్యటనలో భాగంగా కలెక్టరేట్, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు.
కేసీఆర్ పర్యటన నేపథ్యంలో రెండు జిల్లాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో ముందస్తు అరెస్ట్ లు కొనసాగుతున్నాయి.
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, జెండాలతో రోడ్లన్నీ గులాబీమయంగా మారాయి.







