అల్లు అర్జున్‌ పుష్ప 2 అంతా సైలెన్స్... ఫ్యాన్స్ తుఫాన్‌ ను గుర్తు చేసుకోవచ్చు

అల్లు అర్జున్‌, సుకుమార్‌ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 యొక్క చిత్రీకరణ విషయంలో చాలా సైలెంట్ గా ఉంది.పుష్ప సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో పుష్ప 2 సినిమా కూడా కచ్చితంగా భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంతా నమ్మకంగా ఉన్నారు.

 Allu Arjun Sukumar Pushpa 2 Movie Update , Allu Arjun ,sukumar , Pushpa 2 Movie,-TeluguStop.com

కానీ పుష్ప 2 సినిమా విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.మొదటి నుండే అంచనాలు భారీగా పెంచవద్దనే ఉద్దేశ్యంతో చిత్రీకరణ ప్రారంభం

అయిన విషయాన్ని కూడా ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.అందుకే పుష్ప 2 గురించి అల్లు ఫ్యాన్స్ లో గందరగోళం క్రియేట్‌ అయ్యింది.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా దర్శకుడు సుకుమార్‌ పుష్ప 2 విడుదల చేయాలని భావిస్తున్నాడు.

ప్రస్తుతం పుష్ప 2 సైలెంట్‌ గా ఉన్నా కూడా కచ్చితంగా తుఫాన్ ముందు సైలెంట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇప్పుడు పరిస్థితి ఉందని.కచ్చితంగా తుఫాన్‌ ఏ స్థాయిలో ఉంటుందో పుష్ప 2 కూడా అలాగే ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో పుష్ప 2 గురించి ఎక్కువగా ప్రచారం చేయడం లేదు.కానీ పాన్ ఇండియా స్తాయిలో సినిమా విడుదల సమయంలో రెచ్చి పోయి మరీ ప్రమోషన్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.అన్ని వర్గాల వారిని కూడా అలరించే విధంగా ఉంటుందని పుష్ప 2 యొక్క మేకర్స్ వారు చెబుతున్నారు.ఇటీవల వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాల యొక్క ప్రమోషన్ లో పాల్గొన్న మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప 2 మరో లెవల్ అన్నట్లుగా పేర్కొన్నారు.

సైలెన్స్ కచ్చితంగా ముందు ముందు వయొలెన్స్ గా మారుతుందని అంటున్నారు.పుష్ప 2 లో బన్నీ కి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెల్సిందే.పుష్ప 2 ను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube