అల్లు అర్జున్‌ పుష్ప 2 అంతా సైలెన్స్... ఫ్యాన్స్ తుఫాన్‌ ను గుర్తు చేసుకోవచ్చు

అల్లు అర్జున్‌, సుకుమార్‌ ల కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 యొక్క చిత్రీకరణ విషయంలో చాలా సైలెంట్ గా ఉంది.

పుష్ప సినిమా రికార్డు స్థాయిలో వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో పుష్ప 2 సినిమా కూడా కచ్చితంగా భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంతా నమ్మకంగా ఉన్నారు.

కానీ పుష్ప 2 సినిమా విషయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు.

మొదటి నుండే అంచనాలు భారీగా పెంచవద్దనే ఉద్దేశ్యంతో చిత్రీకరణ ప్రారంభం """/"/అయిన విషయాన్ని కూడా ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు.

అందుకే పుష్ప 2 గురించి అల్లు ఫ్యాన్స్ లో గందరగోళం క్రియేట్‌ అయ్యింది.

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా దర్శకుడు సుకుమార్‌ పుష్ప 2 విడుదల చేయాలని భావిస్తున్నాడు.

ప్రస్తుతం పుష్ప 2 సైలెంట్‌ గా ఉన్నా కూడా కచ్చితంగా తుఫాన్ ముందు సైలెంట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఇప్పుడు పరిస్థితి ఉందని.

కచ్చితంగా తుఫాన్‌ ఏ స్థాయిలో ఉంటుందో పుష్ప 2 కూడా అలాగే ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

"""/"/ సోషల్‌ మీడియాలో పుష్ప 2 గురించి ఎక్కువగా ప్రచారం చేయడం లేదు.

కానీ పాన్ ఇండియా స్తాయిలో సినిమా విడుదల సమయంలో రెచ్చి పోయి మరీ ప్రమోషన్ చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

అన్ని వర్గాల వారిని కూడా అలరించే విధంగా ఉంటుందని పుష్ప 2 యొక్క మేకర్స్ వారు చెబుతున్నారు.

ఇటీవల వాల్తేరు వీరయ్య మరియు వీర సింహారెడ్డి సినిమాల యొక్క ప్రమోషన్ లో పాల్గొన్న మైత్రి మూవీ మేకర్స్ వారు పుష్ప 2 మరో లెవల్ అన్నట్లుగా పేర్కొన్నారు.

సైలెన్స్ కచ్చితంగా ముందు ముందు వయొలెన్స్ గా మారుతుందని అంటున్నారు.పుష్ప 2 లో బన్నీ కి జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్న విషయం తెల్సిందే.

పుష్ప 2 ను వచ్చే ఏడాది ఆరంభంలో విడుదల చేసే అవకాశం ఉంది.