జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.రష్మీ గౌతమ్ హీరోయిన్ గా కూడా ఇప్పటికే కొన్ని సినిమాలు చేసింది.
కానీ ఆమెకు హీరోయిన్ గా మంచి పాపులారిటీ మాత్రం దక్కలేదు.హీరోయిన్ గా ఆమె ఇప్పటి వరకు చేసింది చిన్న సినిమాలు మాత్రమే.
అనసూయ మాదిరిగా మీడియం రేంజ్ సినిమా ల్లో ఐటం సాంగ్స్ ను చేసే అవకాశం దక్కినా కూడా ఆమె నో చెప్పిందనే వార్తలు వస్తున్నాయి.హీరోయిన్ గా మాత్రమే నటించేందుకు ఆమె ఓకే చెబుతుంది అని.హీరోయిన్ గా కూడా ఒక మంచి డీసెంట్ కథల కోసం ఈమె వెయిట్ చేస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.ఇటీవల జబర్దస్త్ బ్యూటీ ఒక ప్రముఖ హీరో సినిమాలో ఐటం సాంగ్ చేసే అవకాశం వస్తే కాదన్నట్లుగా సమాచారం అందుతోంది.
హీరోయిన్ గా ఇప్పటికే ఈమెకు పెద్దగా క్రేజ్ రాలేదు.అయినా కూడా ఐటం సాంగ్ ను చేసేందుకు నో చెప్పడం ఆశ్చర్యంగా ఉంది అంటున్నారు.

అనసూయ మాదిరిగా రష్మీ గౌతమ్ ఎందుకు సినిమాల్లో బిజీ అవ్వడం లేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తు ఉంటారు.ఆమె మాత్రం ఎప్పుడు కూడా సినిమాల్లో హడావుడి చేయలేదు.బుల్లి తెర విషయంలో కూడా ఆమె ఆచి తూచి వ్యవహరిస్తూ ఉంది.తెలుగు లో మాత్రమే కాకుండా రష్మీ గౌతమ్ కు ఆ మధ్య తమిళం నుండి కూడా ఆఫర్ వచ్చిందట.
కానీ ఆ సినిమా ను కూడా రష్మీ కాదన్నట్లుగా సమాచారం అందుతోంది.తెలుగు లో మాత్రమే అది కూడా బుల్లి తెరపై సందడి చేస్తున్న రష్మీ గౌతమ్ ను ఆమె అభిమానులు గ్లామర్ పాత్రలో వెండి తెరపై చూడాలని కోరుకుంటున్నారు.
మరి రష్మీ ఎప్పుడు ఐటం సాంగ్ చేస్తుందో చూడాలి.







