తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి, నారాయణ గ్రూపు విద్యాసంస్థల వ్యవస్థాపకుడు పొంగూరు నారాయణ కుటుంబ సభ్యులతో సంబంధమున్న ఎన్‌ఎస్‌పిఆర్‌ఎ (NSPIRA) అనే సంస్థలో ఆంధ్రప్రదేశ్ పోలీసుల నేర పరిశోధన విభాగం (APCID) మంగళవారం తనిఖీలు నిర్వహించింది.ఈ సొమ్ముతో అమరావతిలో బినామీల పేర్లతో నారాయణ అక్రమంగా అసైన్డ్ భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలపై సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు.
ఎన్‌ఎస్‌పిఆర్‌ఎ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను పి నారాయణ కుమార్తె, అల్లుడు డైరెక్టర్‌లుగా (పొంగూరు సింధూర, పునీత్) చేర్చారు.
NSPIRA మేనేజ్‌మెంట్ సర్వీసెస్ నారాయణ గ్రూప్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలల కోసం చాలా కొనుగోళ్లు, మౌలిక సదుపాయాలు మొదలైన అవసరాలకు చెల్లింపులను ఛానెల్ చేస్తూ ఈ లావాదేవీలపై కమీషన్‌లను పొందుతుంది.
ఈ సంస్థ కార్యాలయం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఉండగా నారాయణ గ్రూప్‌కి అనుసంధానించబడిన సంస్థల ఆర్థిక కార్యకలాపాలన్నీ ఇక్కడి నుండి నిర్వహిస్తారు.ఎన్‌ఎస్‌పిఆర్‌ఎ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ పైన సిఐడి అధికారులు మంగళవారం సోదాలు ప్రారంభించారు.
సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని, అమరావతి ప్రాంతంలో జరిగిన భూముల అక్రమ, బినామీ కొనుగోళ్లకు సంబంధించిన నిధుల ప్రవాహంపై కీలక సమాచారం లభించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

అమరావతి రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను భయపెట్టి, బెదిరించి, మభ్యపెట్టి సృష్టించి రూ.5,600 కోట్ల విలువైన సుమారు 1400 ఎకరాల అసైన్డ్ భూములను నారాయణ, ఆయన కుటుంబ సభ్యులు స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు ఉన్నాయని సీఐడీ పేర్కొంది.ఎలాంటి ప్యాకేజీ ఇవ్వకుండా ల్యాండ్ పూలింగ్ పథకం కింద తమ భూములను ప్రభుత్వం తీసుకుంటుందని నారాయణ చెప్పారని, తక్కువ ధరలకు తమ వద్ద భూములు కొనుగోలు చేశారని అందులో పేర్కొన్నారు.
అనంతరం మందడం, వెలగపూడి, రాయపూడి, ఉద్దండరాయునిపాలెం తదితర గ్రామాల్లోని అసైన్డ్ భూములకు ల్యాండ్‌పూలింగ్ పథకం ద్వారా లబ్ధి చేకూరేలా జీవోలు జారీ చేయాలని అప్పటి అధికారులపై మంత్రి ఒత్తిడి తెచ్చారు అని ఆరోపణలు ఉన్నాయి.

వారి పథకం ప్రకారం అప్పటి మంత్రులకు బినామీలుగా వ్యవహరించి పేదల అసైన్డ్ భూములను కొనుగోలు చేసిన కొమ్మారెడ్డి బ్రహ్మానంద రెడ్డి, కేపీవీ అంజనీకుమార్, గుమ్మడి సురేష్, కొల్లి శివరాం, ఆయా మంత్రుల కుటుంబ సభ్యులు తదితరులను ఎంగేజ్ చేశారు’’ అని సీఐడీ పేర్కొంది.నిషేధిత జాబితాలోని భూములపై రిజిస్ట్రేషన్లు, జీపీఏలు అనుమతించాలంటూ మంగళగిరి తదితర సబ్ రిజిస్ట్రార్ అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చారు.ఈ కుంభకోణంలో పొంగూరు నారాయణకు చెందిన బినామీలు, రాజకీయ సన్నిహితులు ప్రధాన లబ్ధిదారులుగా గుర్తించినట్లు సీఐడీ తెలిపింది.
తాము మోసపోయామని గ్రహించిన ఈ అసైన్డ్ భూముల రైతులు ల్యాండ్ పూలింగ్ పథకం కింద తమ హక్కులు, హక్కుల రక్షణ, పునరుద్ధరణ కోసం అధికారులను ఆశ్రయించారని సీఐడీ తెలిపింది.







