టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.చిరంజీవి ఈ వయసులో కూడా అదే ఊపుతో సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు.
ఈ క్రమంలోనే బాబీ దర్శకత్వంలో చిరంజీవి తాజాగా నటించిన చిత్రం వాల్తేరు మీరయ్య.ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.
అలాగే ఇందులో మాస్ మహారాజా రవితేజ కూడా కీలకపాత్రలో నటించాడు.ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది.
ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈ వెంటనే నిర్వహించారు చిత్ర బృందం.
ఈ నేపథ్యంలోనే చిరంజీవి మాట్లాడుతూ.రవితేజను, తనని ఉద్దేశిస్తూ.వరుసగా సినిమాలు తీస్తున్నది ఇద్దరే ఇద్దరు.అది మేమే తెలిపారు చిరంజీవి.చిరంజీవి రవితేజ ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాం అంటూ చిరంజీవి మాట్లాడిన మాటలని ఒక నెటిజన్ మార్ఫింగ్ చేసి చిరంజీవి ఫేస్ మీద కిరణ్ అబ్బవరం ఫేస్, రవితేజ ఫేస్ మీద ఆది సాయికుమార్ ఫేస్ ని మార్ఫింగ్ చేసి అందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.ఇక ఆ వీడియోని చూస్తే ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేసేది ఇద్దరే ఇద్దరు.

అది ఒకరు కిరణ్ అబ్బవరం కాగా మరొకరు ఆది సాయికుమార్ అనే అర్థం వచ్చే విధంగా ఉంది.మరి ఇందులో ఫీల్ అవ్వాల్సిన విషయం ఏముంది అని అంటే కిరణ్ ని చిరంజీవితో ఆదిని రవితేజ తో పోల్చారు.కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఇద్దరినీ అవమానించడం వల్లే కిరణ్ అబ్బవరం రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది.ఆ వీడియోని చూసిన పలువురు నెటిజన్స్ ఆ వీడియో పై విమర్శలు గుప్పిస్తూ కిరణ్ ఆది సాయికుమార్ ఇద్దరూ జనం మీద బలవంతంగా వరుస పెట్టి సినిమాలో వదులుతున్నారు అని కామెంట్ చేయగా

ఆ కామెంట్ కి కిరణ్ ని బాధపెట్టింది.దాంతో బాగా హర్ట్ అయిన కిరణ్ ఆ వీడియోని రీ ట్వీట్ చేస్తూ.వీడియో చేసిన వ్యక్తికి కౌంటర్ ఇచ్చింది.
మోవా నా మూడేళ్ల కెరియర్ లో ఐదు సినిమాలు విడుదల అయ్యాయని నాకు తెలుసు.నాకు తెలియకుండా నా సినిమాలు ఏవైనా విడుదల అయ్యి ఉంటే దయచేసి చెప్పండి.
నీ సమాధానం కోసం ఎదురుచూస్తున్నానా బ్రో అంటూ కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశాడు.ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.








