నటీనటుల అభిమానులు చాలావరకు తమ అభిమాన నటీనటుల సినిమాల విషయంలోనే కాకుండా వ్యక్తిగత విషయంలో కూడా బాగా శ్రద్ధ చూపిస్తుంటారు.వారికి ఏమైనా అయితే అస్సలు తట్టుకోలేక పోతారు.
వారికి సలహాలు ఇవ్వాలి అని అనుకుంటున్నారు.అలా చాలామంది అభిమానులు తమ అభిమాన నటులకు ఇప్పటివరకు వ్యక్తిగత విషయంలో సలహాలు ఇచ్చారు.
అయితే తాజాగా సమంత అభిమానిని కూడా సమంతకు ఒక సలహా ఇచ్చారు.అది కూడా నాగచైతన్యను మళ్లీ పెళ్లి చేసుకోమని.
ఇంతకు అసలు విషయం ఏంటో తెలుసుకుందాం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సమంత ఎంతలా క్రేజీ సంపాదించుకుందో చూసాం.
కెరీర్ మొదటి నుండి ఇప్పటివరకు వెనుతిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీస్తుంది.కేవలం టాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా అవకాశాలు అందుకొని అక్కడ కూడా మంచి పేరు సంపాదించుకుంటుంది.
అయితే సినిమాల పరంగా సమంతకు బాగా కలిసి వచ్చినప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.
గతంలో ఈమె ఒక హీరోని ప్రేమించగా ఆ తర్వాత అతనితో బ్రేకప్ చేసుకొని.మళ్లీ అతనితో కలిసి నటించిన నాగచైతన్యను ప్రేమించి అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకుంది.ఇక పెళ్లి తర్వాత వీరి జంట ఎంతలా ఎంజాయ్ చేసామో చూసాం.
ప్రతి ఒక్కరు ఈర్ష పడేలా అన్నట్లుగా వీరిద్దరూ బాగా ఎంజాయ్ చేశారు.బాగా ట్రిప్స్ కి తిరిగారు.
అలా అక్కినేని కోడలుగా మారాక సమంతకు కూడా బాగా కలిసి వచ్చింది.ఇద్దరు కలిసి పలు సినిమాల్లో కూడా చేశారు.
అయితే ఏం జరిగిందో తెలియదు కానీ నాలుగేళ్లకే వీరిద్దరూ విడిపోయి అందరి హార్ట్ బ్రేక్ చేశారు.ఇప్పటికీ వీరి అభిమానులు వీరి వీడాకులను అస్సలు జీర్ణించుకోలేకపోయారు.
ఇక ఎవరికీ వాళ్ళు దూరంగా ఉంటూ కెరీర్ పరంగా ముందుకు దూసుకుపోతున్నారు.వీరు విడాకులు తీసుకున్నప్పటి నుంచి వీరి గురించి ఏ వార్త వచ్చినా క్షణాలో వైరల్ అవుతుంది.
అయితే గత ఏడాది సమంత తను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న విషయాన్ని తెలిపింది.దీంతో అందరూ ఆమెకు ధైర్యం ఇచ్చారు.ఆ సమయంలోనే ఆమె నటించిన యశోద సినిమా కూడా విడుదల కాగా మంచి సక్సెస్ అందుకుంది.అప్పటివరకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న సమంత ఈ సినిమా సక్సెస్ తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో కనపడలేదు.
ఇక త్వరలో విడుదల కానున్న శాకుంతలం సినిమా సందర్భంగా సోషల్ మీడియాలో అడుగుపెట్టింది.అంతే కాకుండా నిన్న ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ వేడుకల్లో కూడా పాల్గొనగా అక్కడ దిగిన ఫోటోలను కూడా పంచుకుంది.
తాజాగా మరో ఫోటో కూడా పంచుకోగా ఆ ఫోటోకు బాగా లైక్స్, కామెంట్స్ వస్తున్నాయి.అయితే తన అభిమాని తనకు ఒక సలహా ఇచ్చారు.నువ్వు ఒంటరిగా ఉండి ఫ్రెండ్స్ తో చిల్ అవుతూ బాగున్నావని అనుకుంటున్నావు.కానీ సమంత దయచేసి నీ పరిస్థితి అర్థం చేసుకో.
నువ్వు నాగచైతన్యను మళ్లీ పెళ్లి చేసుకోవడం మంచిది అంటూ నాగచైతన్యను ట్యాగ్ చేసి షాక్ ఇచ్చారు.ప్రస్తుతం ఆ కామెంట్ బాగా వైరల్ అవుతుంది.